Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ-makkal selvan vijay sethupathi ace title teaser out now crime comedy thriller ace kollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

Sanjiv Kumar HT Telugu
May 18, 2024 12:03 PM IST

Makkal Selvan Vijay Sethupathi Ace Title Teaser: తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ నటిస్తున్న సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ఏసీఈ. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రంగా వస్తోన్న ఏసీఈ టైటిల్ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ పూర్తి విశేషాల్లోకి వెళితే..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

Vijay Sethupathi Ace Title Teaser Out: కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న సరికొత్త సినిమా ఏసీఈ. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇలా విజయ్ సేతుపతి, రుక్మిణి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాకు ఆరుముగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రుక్మిణితోపాటు కమెడియన్ యోగి బాబు, పి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనింగ్ ఎ.కె. ముత్తు, ఆర్. గోవిందరాజ్ ఎడిటింగ్ వర్క్స్ చేస్తున్నారు.

'ఏసీఈ' అనే డిఫరెంట్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్‌గా నిర్మిస్తోంది. సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో రివీల్ చేసిన ఫస్ట్ లుక్‌లో విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్, డైస్ వేస్తూ కనిపించి అందరినీ ఆకర్షించారు. ఈ పోస్టర్ సినిమా గురించి అభిమానులలో క్యురియాసిటీని పెంచింది.

తాజాగా ఏసీఈ టీజర్‌ను ఇవాళ అంటే మే 18న విడుదల చేశారు మేకర్స్. స్టార్ కాస్ట్, ఆకట్టుకునే నేపథ్య సంగీతం, విజయ్ సేతుపతి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. జూదం, తుపాకులు, పేలుళ్లు, రాబరీస్, బైక్ ఛేజింగ్ వంటి అంశాలు అలరించాయి.

టీజర్‌లో యోగి బాబు కామిక్ రియాక్షన్ హ్యుమర్ రేకెత్తిస్తుంది. ఇది సినిమా హిలేరియస్ క్రైమ్-కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలియజేస్తుంది. ఈ విజువల్ గ్లింప్స్, టైటిల్ ప్రివ్యూ, జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు యానిమేటెడ్ ఫార్మాట్‌లో పాత్రల ముఖ్యమైన అంశాలు రివిల్ చేయడం వల్ల ఈ టీజర్ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది.

సినిమా సింగిల్ ట్రాక్, టీజర్‌ని అభిమానులందరూ ఆస్వాదించేలా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ టీమ్ అనౌన్స్ చేసింది. ఈ ఏడాది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఏసీఈ రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇదివరకు ఈ ఏడాదిలో విజయ్ సేతుపతి నుంచి వచ్చిన సినిమా మెర్రీ క్రిస్మస్.

కత్రీనా కైఫ్‌తో విజయ్ సేతుపతి జోడీ కట్టిన ఈ సినిమాను శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా కొంచెం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. 60 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీకి ఓవరాల్‌గా రూ. 26.02 కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. కానీ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మెర్రీ క్రిస్మస్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్‌లో కంటే ఓటీటీలోనే ఈ సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చింది.

ఇప్పుడు ఇదే సంవత్సరం క్రైమ్ కామెడీ కమర్షియల్ చిత్రంగా ఏసీఈ సినిమాతో సందడి చేయనున్నాడు విజయ్ సేతుపతి. దీంతో అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. కాగా విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. అంతకుముందు చిరంజీవి సైరా నరసింహా రెడ్డి మూవీలో ఓ కెమియో రోల్‌తో ఎంట్రీ ఇచ్చాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.

టీ20 వరల్డ్ కప్ 2024