The 100: మరోసారి పోలీస్‌గా మొగలి రేకులు హీరో.. చిరంజీవి తల్లి చేతుల మీదుగా ది 100 టీజర్ రిలీజ్-chiranjeevi mother konidela anjana devi released rk sagar the 100 teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The 100: మరోసారి పోలీస్‌గా మొగలి రేకులు హీరో.. చిరంజీవి తల్లి చేతుల మీదుగా ది 100 టీజర్ రిలీజ్

The 100: మరోసారి పోలీస్‌గా మొగలి రేకులు హీరో.. చిరంజీవి తల్లి చేతుల మీదుగా ది 100 టీజర్ రిలీజ్

Sanjiv Kumar HT Telugu
Apr 26, 2024 03:55 PM IST

The 100 Teaser Released By Chiranjeevi Mother: మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే నాయుడు అలియాస్ ఆర్కే సాగర్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమా ది 100. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మెగా మదర్ కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు.

మరోసారి పోలీస్‌గా మొగలి రేకులు హీరో.. చిరంజీవి తల్లి చేతుల మీదుగా ది 100 టీజర్ రిలీజ్
మరోసారి పోలీస్‌గా మొగలి రేకులు హీరో.. చిరంజీవి తల్లి చేతుల మీదుగా ది 100 టీజర్ రిలీజ్

The 100 Teaser Konidela Anjana Devi: మొగలి రేకులు ఫేమ్ ఆర్‌కె సాగర్ అప్ కమింగ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'ది 100'. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. పోస్టర్‌లో ఆర్‌కె సాగర్‌ను విక్రాంత్ ఐపీఎస్‌గా పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి తల్లి, మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు.

ఐపీఎస్ అధికారి విక్రాంత్ చేసిన తప్పులపై మానవ హక్కుల కమిషన్ విచారించడంతో టీజర్ ప్రారంభమైంది. నగర శివార్లలో కొన్ని సామూహిక హత్యలు జరుగుతాయి. అందులో వారంతా రౌడీ షీటర్లు. పోలీసుల విచారణ జరుగుతోంది. నేరస్థులను ఎదుర్కోవడంలో తనదైన స్టైల్ కలిగి ఉన్న హీరో తన పద్దతి గురించి మీడియా లేదా ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోరు.

అతను ఉన్నతాధికారుల, మానవ హక్కుల కమిషన్‌కు కూడా భయపడడు. తనున్న చోట నేరాలను నిర్మూలించడానికి ఎంతకైనా తెగించే నిజాయితీ గల ఐపీఎస్ అధికారి స్వభావాన్ని తెలియజేసేలా టీజర్ ఉంది. RK సాగర్ ఖాకీ దుస్తులలో ఫిట్‌గా కనిపించారు. అతని ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉంది. రాఘవ్ ఓంకార్ శశిధర్ క్యారెక్టర్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు.

ది 100 టీజర్‌ని బట్టి చూస్తే సినిమా గ్రిప్పింగ్ కథనంతో యాక్షన్‌లో ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఆర్కే సాగర్ సరసన మిషా నారంగ్ నటిస్తున్న ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు కెమెరామెన్ కాగా, యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్ బాధ్యతలు చేపట్టగా.. చిన్నా ప్రొడక్షన్‌ డిజైనర్‌‌గా, సుధీర్ వర్మ పేరిచర్ల డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణతోపాటు గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల్ స్వామి, కల్యాణి నటరాజన్, బాల కృష్ణ, జయంత్, విష్ణు ప్రియ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

తెలుగు టెలివిజన్ చరిత్రలో ఏ సీరియల్ అందుకోలేని పేరు తెచ్చుకుంది మొగలి రేకులు (Mogalirekulu Serial). ఆ సీరియల్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడుగా (RK Naidu), అతని కొడుకు మహిధర్ నాయుడు/మున్నా పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు సాగర్ (Sagar).

మొగలి రేకులు ఆర్కే నాయుడు పాత్ర ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు వెండితెరపై హీరోగా అలరించేందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సాగర్. కానీ, అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు హీరోగా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ది 100తో వస్తున్నాడు సాగర్.

IPL_Entry_Point