Karthi: తమిళ హీరో కార్తీ కాపీ కొట్టిన 10 తెలుగు సినిమా టైటిల్స్.. చిరంజీవివే ఎక్కువ!-kollywood hero karthi movies titles copied from telugu like chiranjeevi khaidi donga sultan chinababu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthi: తమిళ హీరో కార్తీ కాపీ కొట్టిన 10 తెలుగు సినిమా టైటిల్స్.. చిరంజీవివే ఎక్కువ!

Karthi: తమిళ హీరో కార్తీ కాపీ కొట్టిన 10 తెలుగు సినిమా టైటిల్స్.. చిరంజీవివే ఎక్కువ!

Sanjiv Kumar HT Telugu
Apr 12, 2024 01:30 PM IST

Karthi Movies With Telugu Titles: తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకేనేమో ఆయన సినిమాలకు చాలా వరకు తెలుగు టైటిల్స్ పెట్టాడు. మరి తెలుగు సినిమా టైటిల్స్‌తో చేసిన కార్తీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

తమిళ హీరో కార్తీ కాపీ కొట్టిన 10 తెలుగు సినిమా టైటిల్స్.. చిరంజీవివే ఎక్కువ!
తమిళ హీరో కార్తీ కాపీ కొట్టిన 10 తెలుగు సినిమా టైటిల్స్.. చిరంజీవివే ఎక్కువ!

Karthi Telugu Title Movies: కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు కార్తీ. అగ్ర కథానాయకుడు సూర్య తమ్ముడిగా యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తనకు తమిళ ఆడియెన్స్ కంటే తెలుగు ప్రేక్షకులు చాలా ఇష్టం అని ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పాడు కార్తీ.

పది సినిమాలకు

అయితే, యాధృచ్చికమో, కావాలని పెట్టారో తెలియదు కానీ దాదాపుగా పది సినిమాలకు కార్తీ తెలుగు మూవీ టైటిల్స్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. వాటిలో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ఉండటం విశేషం. మరి ఆ సినిమాలు ఏంటో, ఆ టైటిల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసుకుందాం.

ఖైదీ

కార్తీ సినీ కెరీర్‌లో అదిరిపోయే సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఖైదీ. ఇందులో ఢిల్లీ పాత్రతో చాలా పాపులర్ అయ్యాడు కార్తీ. ఈ సినిమాకు విక్రమ్, లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభమైంది. ఇక ఈ టైటిల్‌ను మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమా నుంచి యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకున్నాడు కార్తీ. 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవికి ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది.

సుల్తాన్

నందమూరి బాలకృష్ణ డ్యూయెల్ రోల్‌లో నటించిన సినిమా సుల్తాన్. 1999లో బాలయ్య, కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మల్టీ స్టారర్‌గా వచ్చిన ఈ సినిమా టైటిల్‌ను కార్తీ తన మూవీకి వాడేసుకున్నాడు. 2021లో వచ్చిన కార్తీ సుల్తాన్ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేయగా.. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు.

చినబాబు

రైతుల గొప్పదనం, కుటుంబ విలువలు, బంధాల గురించి మంచి మెసేజ్ ఒరియెంటెడ్ చిత్రంగా వచ్చిన కార్తీ మూవీ చినబాబు. 2018 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా టైటిల్‌ను టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, అమల నటించిన చినబాబు నుంచి కార్తీ తీసుకున్నాడు కార్తీ. ఈ మూవీ 1988లో విడుదలైంది.

కాశ్మోరా

కార్తీ, లేడి సూపర్ స్టార్ నయనతార నటించిన సినిమా కాశ్మోరా. ఇందులో రెండు విభిన్నపాత్రల్లో కార్తీ నటించి అలరించాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు. అయితే, ఈ సినిమా పేరుతో నట కిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ కాశ్మోరా 1986లో విడుదలైంది. ఇందులో భాను ప్రియ, రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ అయింది.

దొంగ

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో దొంగ మూవీ ఒకటి. ఈ సినిమా టైటిల్‌తో 2019లో కార్తీ దొంగ మూవీ చేశాడు. కానీ, ఈ సినిమా తమిళంలో తంబిగా వచ్చింది. తెలగులో మాత్రం దొంగగా విడుదల చేశారు. ఇందులో సూర్య భార్య, హీరోయిన్, నటి జ్యోతిక కీలక పాత్ర పోషించింది. జ్యోతికకు కార్తీ తమ్ముడిగా నటించిన ఈ సినిమా పర్వాలేదనిపించింది.

సర్దార్

కార్తీ సినీ కెరీర్‌లో మరో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ సర్దార్. ఇందులో తండ్రీకొడుకుల పాత్రలో డ్యూయల్ రోల్ చేశాడు కార్తీ. ఇందులో రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్‌గా చేశారు. ఈ సినిమా టైటిల్ చూడగానే మనకు పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, సీనియర్ ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు మూవీస్ గుర్తుకు వస్తాయి.

చిరంజీవివే

ఇంకా కార్తీ ఖాకీ టైటిల్‌ను, సాయి కుమార్ ఖాకీ చొక్కా, మల్లిగాడును సూపర్ స్టార్ కృష్ణ మాయదారి మల్లిగాడు నుంచి, దేవ్ మూవీని శ్రీహరి నటించిన దేవా టైటిల్ నుంచి, చెలియా సినిమాను ఆర్ మాధవన్ చెలి పేరు నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిలో ఖైదీ, దొంగ టైటిళ్లను చిరంజీవి సినిమాల నుంచే కార్తీ ఎక్కువగా తీసుకున్నట్లు అనిపిస్తోంది.

IPL_Entry_Point