Japan Teaser: జపాన్ టీజర్ వచ్చేసింది.. మళ్లీ అదరగొట్టిన కార్తీ-japan teaser released karthi at his best again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Japan Teaser: జపాన్ టీజర్ వచ్చేసింది.. మళ్లీ అదరగొట్టిన కార్తీ

Japan Teaser: జపాన్ టీజర్ వచ్చేసింది.. మళ్లీ అదరగొట్టిన కార్తీ

Hari Prasad S HT Telugu

Japan Teaser: జపాన్ టీజర్ వచ్చేసింది. మరోసారి అదరగొట్టేశాడు తమిళ స్టార్ నటుడు కార్తీ. దీపావళికి రీలీజ్ అవుతున్న ఈ మూవీ టీజర్.. రూ.200 కోట్ల నగల చోరీ చుట్టూ తిరిగింది.

జపాన్ మూవీలో కార్తీ

Japan Teaser: జపాన్ మూవీ టీజర్ బుధవారం (అక్టోబర్ 18) రిలీజైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తీ.. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో వస్తున్న అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ జపాన్. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్లో ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజా విడుదలైన జపాన్ మూవీ టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగా సాగిపోయింది. టీజర్ లో అడ్వెంచరస్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కార్తీ డిఫరెంట్ గెటప్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అత్యద్భుతమైన లుక్స్, పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేశాడు కార్తీ. చివర్లో 'ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ ను ఎవరూ ఏం పీకలేర్రా' అని కార్తీ చెప్పిన డైలాగ్, వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది.

టీజర్ మొదట్లోనే ఓ పెద్ద కన్నం వేసి రూ.200 కోట్ల నగలు ఎత్తుకుపోయే సీన్ చూపించారు. ఈ దొంగతనం స్టైల్ చూస్తే జపాన్ లాగే ఉందంటూ ఓ పోలీసు చెబుతాడు. ఇండియాలోనే 182 కేసులు ఉన్నాయంటూ జపాన్ క్యారెక్టర్ ను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు.. ఇప్పటి వరకూ ఎవరూ పట్టుకోలేకపోయారనే డైలాగ్స్ మధ్య కార్తీ ఎంట్రీ ఇస్తాడు.

ఇక ఈ టీజర్ లో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. అతడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఈ జపాన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జపాన్ లో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.