Mogalirekulu Hero: మొగలి రేకులు హీరో కొత్త చిత్రం ద 100.. మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా!-mogalirekulu rk naidu sagar the 100 movie poster released sagar the 100 first look out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mogalirekulu Hero: మొగలి రేకులు హీరో కొత్త చిత్రం ద 100.. మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా!

Mogalirekulu Hero: మొగలి రేకులు హీరో కొత్త చిత్రం ద 100.. మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా!

Sanjiv Kumar HT Telugu
Feb 03, 2024 12:13 PM IST

RK Naidu The 100 Movie: మొగలి రేకులు సీరియల్ హీరో సాగర్ నటించిన కొత్త సినిమా ద 100. సీరియల్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ ఆర్కే నాయుడుగా నటించిన సాగర్ మరోసారి అలాంటి పాత్రతో ద 100 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ద 100 మూవీ రిలీజ్ ఎప్పుడనే వివరాల్లోకి వెళితే..

మొగలి రేకులు హీరో కొత్త చిత్రం ద 100.. మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా!
మొగలి రేకులు హీరో కొత్త చిత్రం ద 100.. మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా!

Mogali Rekulu Sagar The 100: తెలుగు టెలివిజన్ చరిత్రలో ఏ సీరియల్ అందుకోలేని పేరు తెచ్చుకుంది మొగలి రేకులు (Mogalirekulu Serial). ఆ సీరియల్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడుగా (RK Naidu), అతని కొడుకు మహిధర్ నాయుడు/మున్నా పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు సాగర్ (Sagar). మొగలి రేకులు ఆర్కే నాయుడు పాత్ర ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు వెండితెరపై హీరోగా అలరించేందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సాగర్.

'సిద్ధార్థ' అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సాగర్. అనంతరం 'షాదీ ముబారక్‌' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు హీరో ఆర్కే సాగర్. ''ద 100'' అనే వైవిధ్యమైన టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు. గతంలో రాఘవ్ ఓంకార్ శశిధర్ డైరెక్ట్ చేసిన ఇండిపెండెంట్ ఫిలిమ్స్‌కు చాల అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయి.

ఇప్పుడు డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ జరిగింది. ద 100 సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారి పాత్రలో సాగర్ నటిస్తున్నాడు. 'ద 100' చిత్రంలో తన పాత్ర కోసం ఆర్కే సాగర్ ఫిట్‌నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. టైటిల్ పోస్టర్‌‌లో పంచింగ్ హ్యాండ్‌ని గమనిస్తే మూవీ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో మంచి యాక్షన్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

విక్రాంత్ ఐపీఎస్ పాత్రలో ఆర్కే సాగర్ ఇంప్రెస్ చేయనున్నాడు, ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ అలాగే కమర్సియల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డికి, బాలీవుడ్ చిత్రం యనిమల్‌కి సంగీతం సమకూర్చిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం.

షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకున్న ‘ద 100’ చిత్రం త్వరలో థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ అందరూ చూడదగ్గ సినిమాగా ఈ మూవీని తీర్చిదిద్దడం జరిగిందని మేకర్స్ చెబుతున్నారు. చూస్తుంటే.. మొగలి రేకులు సీరియల్‌లో ఆర్కే నాయుడుగా పవర్ ఫుల్ పోలీసుగా ఎంతోమంది మన్ననలు పొందిన హీరో సాగర్ ఇప్పుడు సినిమాలో కూడా మరోసారి అలాంటి పాత్ర చేసి మెప్పిస్తాడని తెలుస్తోంది.

ఎందుకంటే మొగలి రేకులు సీరియల్‌లో ఆర్కే నాయుడు పాత్రలో సాగర్ ఒదిగిపోయి నటించాడు. అధికారిగా బాధ్యతలు, కుటుంబ బంధాల విలువలు, శత్రువులను ఎదుర్కొనే గట్స్ ఉన్న ఆఫీసర్‌గా సాగర్ అద్భుతంగా నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్‌గా నిలిచాడు. మరి ఇప్పుడు ద 100 అనే మూవీలో మరోసారి అలాంటి పాత్రతో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. అయితే ఇప్పటికీ ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Whats_app_banner