Tiger 3: కత్రీనా కైఫ్‌ టవల్ ఫైట్ సీన్.. దానికోసం ఎంత కష్టపడ్డారో తెలుసా?-actress michelle lee about towel fight scene with katrina kaif in tiger 3 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger 3: కత్రీనా కైఫ్‌ టవల్ ఫైట్ సీన్.. దానికోసం ఎంత కష్టపడ్డారో తెలుసా?

Tiger 3: కత్రీనా కైఫ్‌ టవల్ ఫైట్ సీన్.. దానికోసం ఎంత కష్టపడ్డారో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Oct 28, 2023 10:03 AM IST

Katrina Kaif Towel Scene: టైగర్ 3 సినిమాలో కత్రీనా కైఫ్ టవల్ ఫైట్ సీన్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా ఈ సీన్‌పై అందులో పాల్గొన్న మరో నటి మిచెల్ లీ తాజాగా స్పందించింది.

కత్రీనా కైఫ్‌ టవల్ ఫైట్ సీన్.. దానికోసం ఎంత కష్టపడ్డారో తెలుసా?
కత్రీనా కైఫ్‌ టవల్ ఫైట్ సీన్.. దానికోసం ఎంత కష్టపడ్డారో తెలుసా?

స్టార్ హీరోయిన్ స్కార్లెట్ జాన్స‌న్ నటించిన బ్లాక్ విడో, అగ్ర కథానాయకుడు జానీ డెప్ పైరెట్స్ ఆఫ్ క‌రేబియ‌న్‌, బ్రాడ్ పిట్ బుల్లెట్ ట్రెయిన్, టామ్ హార్డీ వెనమ్ ఇలా ప‌లు క్రేజీ హాలీవుడ్ సినిమాల్లో అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించి మెప్పించిన హాలీవుడ్ న‌టి మిచెల్ లీ. ఆమె తాజాగా ‘టైగర్ 3’ చిత్రంలో మరోసారి వావ్ అనిపించే యాక్ష‌న్ సీక్వెన్స్‌లో మెప్పించ‌నుంది.

హామామ్‌లో షూటింగ్

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, హాట్ బ్యూటి క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టించిన యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీ ‘టైగర్ 3’. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలైన విషషయం తెలిసిందే. ఇందులో క‌త్రినా, మిచెల్ లీ మ‌ధ్య ఉన్న ట‌వ‌ల్ ఫైట్ సీన్ ఆసక్తికరంగా అనిపించింది. ఆ సీన్ ఇంట‌ర్నెట్‌లో ఎంత వైర‌ల్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ట‌వ‌ల్ ఫైట్ సీన్‌ని ట‌ర్కిష్‌లోని హామామ్‌లో చిత్రీక‌రించారు.

‘టైగర్ 3’లో చూపించిన ట‌వల్ ఫైట్‌లోని ఓ చిన్న స‌న్నివేశం నెట్టింట వైర‌ల్ కావ‌డంపై తాజాగా మిచెల్ స్పందించింది. "కత్రినాతో నేను చేసిన టవల్ ఫైట్‌కి సంబంధించిన చిన్న స‌న్నివేశం గురించి ఇలా అంద‌రూ మాట్లాడుకోవ‌టంపై నేనేమీ ఆశ్చ‌ర్య‌పోవ‌టం లేదు. దీన్ని చిత్రీక‌రించే స‌మ‌యంలో దీని గురించి అంద‌రూ మాట్లాడుకునేంత డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని న‌మ్మాను" అని మిచెల్ తెలిపింది.

చాలా సులువుగా

"ఈ ఫైట్‌ను చిత్రీక‌రించ‌టానికి ముందు నేను, క‌త్రినా క‌లిసి కొన్ని వారాల పాటు ప్రాక్టీస్ చేశాం. ఆ ఫైట్‌, దాన్ని డిజైన్ చేసిన తీరు అద్భుతం. అందులో న‌టించేట‌ప్పుడు బాగా ఎంజాయ్ చేశాం. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌లో దీన్ని రూపొందించారు. క‌త్రినా కైఫ్ గొప్ప న‌టి. ఎంతో ప్రొఫెష‌న‌ల్ ప‌ర్స‌న్‌. ఈ ఫైట్‌లో న‌టించ‌టానికి త‌నెంతో క‌ష్ట‌ప‌డింది. త‌నతో వ‌ర్క్ చేయ‌టం ఎంతో సులువుగా అనిపించింది" అని మిచెల్ పేర్కొంది.

"మేం శరీరాలకు టవల్స్ చుట్టుకుని యాక్ష‌న్ సీక్వెన్స్‌లో పాల్గొన్నాం. ఇలాంటి యాక్ష‌న్ సీక్వెన్స్ చేయ‌టానికి క‌చ్చిత‌మైన యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అవ‌స‌రం. దాన్ని ఎంతో అందంగా డిజైన్ చేశారు. ఇదొక ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఒక‌రినొక‌రు గాయ‌ప‌రుచుకోకుండా ఓ క‌చ్చిత‌మైన దూరాన్ని పాటిస్తూ ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొన‌టం కూడా ఓ ఛాలెంజింగ్ విష‌య‌మే. ఇద్ద‌రం ఎంతో ప్రొఫెష‌న‌ల్‌గా ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి గాయాలు కాలేదు" అని మిచెల్ చెప్పుకొచ్చింది.

దీపావళి సందర్భంగా

కాగా య‌ష్ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ రూపొందిస్తోన్న స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా టైగ‌ర్ 3 మూవీ తెరకెక్కింది. దీనికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించారు. మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా దీపావ‌ళి సంద‌ర్బంగా న‌వంబ‌ర్ 12న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్