Ind vs Pak Tiger 3: వన్డే వరల్డ్ కప్‌లో టైగర్ 3 రికార్డ్.. భారత్ పాక్ మ్యాచ్‌లో సల్మాన్ కత్రీనా ట్రీట్!-salman khan katrina kaif tiger 3 take over ind vs pak match and yrf promotions at odi world cup 2023 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Pak Tiger 3: వన్డే వరల్డ్ కప్‌లో టైగర్ 3 రికార్డ్.. భారత్ పాక్ మ్యాచ్‌లో సల్మాన్ కత్రీనా ట్రీట్!

Ind vs Pak Tiger 3: వన్డే వరల్డ్ కప్‌లో టైగర్ 3 రికార్డ్.. భారత్ పాక్ మ్యాచ్‌లో సల్మాన్ కత్రీనా ట్రీట్!

Sanjiv Kumar HT Telugu
Oct 13, 2023 12:47 PM IST

Tiger 3 In CWC 2023: భారత్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. ఇలా క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీతో అసోసియేట్ అవుతున్న నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ చరిత్ర సృష్టించనుంది.

వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ అసోసియేషన్‌తో ‘టైగర్ 3’
వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ అసోసియేషన్‌తో ‘టైగర్ 3’

Tiger 3 At Ind vs PAK WC 2023: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హాట్ బ్యూటి కత్రీనా కైఫ్ మరోసారి జంటగా నటిస్తున్న సినిమా టైగర్ 3. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. అయితే ప్రస్తుతం ఇండియాలో వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ వరల్డ్ కప్‌తో టైగర్ 3 టీమ్ అసోసియేట్ కానుంది.

వరల్డ్ కప్ అంతా

వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్‌ అయిన స్టార్ స్పోర్ట్స్‌తో వైఆర్ఎఫ్ సంస్థ చేతులు కలిపింది. దీంతో కనువినీ ఎరుగని రీతిలో దీపావళికి రిలీజ్ కానున్న టైగర్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. ఇలా క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీలోనే అసోసియేట్ అయిన బిగ్గెస్ట్ మూవీ నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ చరిత్ర సృష్టించనుంది. ఈ అసోసియేషన్ వల్ల ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ అంతా టైగర్ 3 మూవీ ప్రమోషన్స్ మారు మోగుతాయి.

కీలక మ్యాచుల్లో

క్రికెట్ వరల్డ్ కప్‌లో జరుగుతన్న మ్యాచ్‌లన్నింటిలో వైఆర్ఎఫ్ సంస్థ టైగర్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేయనుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరీ ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య జరగనున్న మ్యాచ్‌లో టైగర్ 3 సినిమా గురించి ప్రమోట్ చేస్తారు. దీని కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రికెట్ వరల్డ్ కప్ కో బ్రాండింగ్ ప్రోమోస్‌లో నటించడం విశేషం. ఈ ప్రోమోలను ఈ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కీలక మ్యాచుల్లో ప్రదర్శిస్తారు.

క్యాష్ చేసుకుంటూ

ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ మార్కెటింగ్‌లో ఇదే భారీ అసోసియేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని టాక్ వినిపిస్తోంది. కాగా 2019లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లను 500 మిలియన్స్‌కు పైగా వీక్షించగా.. మరి ముఖ్యంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌ను 200 మిలియన్స్‌కు పైగా చూశారు. మరి 2023లో ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది. దీన్ని టైగర్ 3 టీమ్ క్యాష్ చేసుకోనుందని టాక్. ఇదిలా ఉంటే యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో తెరకెక్కిన టైగర్ 3 చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. ఆదిత్య చోప్రా నిర్మాత. టైగర్ 3 నవంబర్ 10న రిలీజ్ కానుంది.

Whats_app_banner