OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?
OTT Movies Releases Friday: ఓటీటీలో ఒక్కరోజున సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని ఏకంగా 10 విడుదల అయ్యాయి. వాటిలో మూడు మాత్రం చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ.. వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Today OTT Releases: ప్రతి వారం ఓటీటీలో ఢిపరెంట్ కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీసులు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతాయన్న విషయం తెలిసిందే. అయితే వాటిలో ఎక్కువ శాతం శుక్రవారం (Friday OTT Release) రోజున స్ట్రీమింగ్ అవుతుంటాయి. వీకెండ్‌లో సినిమాలు చూసేందుకు ఎక్కువ స్కోప్ ఉండటంతో దర్శకనిర్మాతలు, ఓటీటీ సంస్థలు ఈ ఫ్రైడే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు.
ఈ వారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 21కిపైగా స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో ఏకంగా పది ఒక్కరోజు అదే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో మూడంటే మూడు మాత్రమే చూసేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. మరి అవేంటో వాటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
పవర్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 17
ది 8 షో (కొరియన్ వెబ్ సిరీస్)- మే 17
థెల్మాద యూనికార్న్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 17
జీ5 ఓటీటీ
బస్తర్: ది నక్సల్ స్టోరీ (హిందీ చిత్రం)- మే 17
తళమై సెయలగమ్ (తమిళ వెబ్ సిరీస్)- మే 17
99 ఇంగ్లీష్ (వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- మే 17
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- మే 17
జర హట్కే జర బచ్కే (హిందీ చిత్రం)- జియో సినిమా ఓటీటీ- మే 17
ది బిగ్ సిగార్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 17
ఎల్లా (హిందీ మూవీ)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 17
వారానికో ఎపిసోడ్
ఇలా ఈ శుక్రవారం (మే 17) సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 10 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ చాలా స్పెషల్ కానుంది. 7 భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ నుంచి కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే అందుబాటులో ఉంచారు. అనంతరం వారానికో ఎపిసోడ్ చొప్పున స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.
డిజాస్టర్-అయినా స్పెషల్
కాంట్రవర్సీ అండ్ చాలా ఇంపాక్ట్ చేసిన ది కేరళ స్టోరీ కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమానే బస్తర్ ది నక్సల్స్ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదా శర్మ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రూ. 15 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1.79 నుంచి 3 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. ఐఎమ్‌డీబీ 10కి 6.4 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ఓటీటీ స్పెషల్ మూవీగా పరిగణించవచ్చు.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్
బాలీవుడ్‌లో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా జర హట్కే జర బచ్కే. కత్రీనా కైఫ్ భర్త, హీరో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ జియో సినిమా ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 115.89 కోట్ల కొల్లగొట్టి ఈ వారం ఓటీటీలో అతిపెద్ద స్పెషల్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, భోజ్‌పురి భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
టాపిక్