Bastar day 3 box office: బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన బస్తర్ ది నక్సల్ స్టోరీ.. ది కేరళ స్టోరీ కంటే చాలా తక్కువగా..-bastar day 3 box office adah sharma movie fails far behind the kerala story collection bollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bastar Day 3 Box Office: బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన బస్తర్ ది నక్సల్ స్టోరీ.. ది కేరళ స్టోరీ కంటే చాలా తక్కువగా..

Bastar day 3 box office: బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన బస్తర్ ది నక్సల్ స్టోరీ.. ది కేరళ స్టోరీ కంటే చాలా తక్కువగా..

Hari Prasad S HT Telugu
Mar 18, 2024 10:17 AM IST

Bastar day 3 box office: అదా శర్మ నటించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా కేవలం రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన బస్తర్ ది నక్సల్ స్టోరీ.. ది కేరళ స్టోరీ కంటే చాలా తక్కువగా..
బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన బస్తర్ ది నక్సల్ స్టోరీ.. ది కేరళ స్టోరీ కంటే చాలా తక్కువగా..

Bastar day 3 box office: బాలీవుడ్ నటి అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ మూవీ గతేడాది ఎంత సంచలన విజయం సాధించిందో తెలుసు కదా. ఈ మధ్యే ఓటీటీలోనూ రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా మంచి ఆదరణ సంపాదించింది. అయితే ఆ మూవీ డైరెక్టర్ సుదీప్తో సేన్, అదా శర్మ కాంబినేషన్ లోనే వచ్చిన బస్తర్ ది నక్సల్ స్టోరీ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

బస్తర్‌కు దారుణమైన కలెక్షన్లు

గత శుక్రవారం (మార్చి 15) థియేటర్లలో రిలీజైన బస్తర్ ది నక్సల్ స్టోరీ మూవీ ఫస్ట్ వీకెండ్ లో దారుణమైన కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకూ మూడు రోజులు కలిపి ఇండియాలో కేవలం రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తొలి రోజు కేవలం రూ.40 లక్షల వసూళ్లతో మొదలైన బస్తర్ మూవీ.. రెండో రోజు రూ.75 లక్షలు, మూడో రోజైన ఆదివారం రూ.90 లక్షలు కలెక్ట్ చేసింది.

గతేడాది ఇదే అదా శర్మ, సుదీప్తో సేన్, ప్రొడ్యూసర్ విపుల్ అమృత్‌లాల్ షా త్రయం ది కేరళ స్టోరీతో కలెక్షన్ల వర్షం కురిపించింది. కానీ బస్తర్ విషయంలో మాత్రం వాళ్ల అంచనా తప్పింది. మూడు రోజులు కలిపి ఇండియాలో ఈ సినిమా కేవలం రూ.2.05 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. చత్తీస్‌గఢ్ లోని బస్తర్ లో నక్సల్స్ తిరుగుబాటు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

బస్తర్ మూవీలో అదా శర్మ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. వీళ్ల కాంబినేషన్ లో గతేడాది వచ్చిన ది కేరళ స్టోరీ మూవీ రిలీజైన మూడో రోజు ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేయగా.. బస్తర్ మాత్రం కేవలం రూ.90 లక్షలే రాబట్టడం గమనార్హం. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బస్తర్ మూవీ రిలీజ్ కు ముందే ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇదొక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సినిమాగా విమర్శలు అభివర్ణించారు.

బస్తర్ మూవీ ఎలా ఉందంటే?

చత్తీస్‍గఢ్‍ రాష్ట్రం సుక్మాలో 2010లో నక్సలైట్ల దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఘటన ఆధారంగా ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చిత్రం తెరకెక్కింది. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న బస్తర్ ప్రాంతం నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ ఉంది. నక్సలైట్లు ఆ ప్రాంతం వారిని భయపెట్టినట్టు, భద్రతా దళాలను, అధికారులను చంపినట్టు ఈ మూవీలో మేకర్స్ చూపించారు.

నక్సలైట్ల సంక్లిష్టమైన చరిత్రను విభిన్న కోణాల్లో కాకుండా ఒకే తీరులో ఈ చిత్రంలో మేకర్స్ చూపించారు. రాసుకున్న కథకు అనుగుణంగా ఒకే దిశగా ఈ సినిమాను తెరకెక్కించారు. వివిధ కోణాల్లో నక్సలైట్ల అంశాన్ని చూపించే ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. నక్సలైట్లను దేశ వ్యతిరేకులుగా, అభివృద్దికి ఆటంకాలుగా చూపించారు. కొందరు ప్రొఫెసర్లు, కార్యకర్తలు.. యూనివర్సటీ విద్యార్థులు, విద్యార్థులకు నక్సలిజనాన్ని నూరిపోసినట్టు సీన్లు కూడా ఉన్నాయి. అయితే, నక్సలిజాన్ని నిరోధించడం ఎంత అవసరమో కూడా మేకర్స్ బలంగా తెరకెక్కించారు.