(1 / 5)
నటి అదా శర్మకు 'ది కేరళ స్టోరీ' సినిమా కారణంగా బాగా క్రేజ్ వచ్చింది. ఈరోజు (మే 11) అదా తన పుట్టినరోజును జరుపుకొంటుంది. నటి అదా శర్మ గ్లామరస్ ఫోటోలు, ఫిట్‌నెస్ వీడియోలు చాలా ఫేమస్.. షేర్ చేయగానే వైరల్ అవుతాయి.
(2 / 5)
మే 11, 1992న ముంబైలో జన్మించిన అదా 2008లో విక్రమ్ భట్ తీసిన హారర్ చిత్రం '1920'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె లీసా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
(3 / 5)
2014లో నితిన్ నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం హార్ట్ ఎటాక్ తో సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఈ సినిమాలో నితిన్ సరసన నటించింది. తెలుగు, కన్నడ చిత్రాలలో మెరిసింది. సన్నాఫ్ సత్యమూర్తిలాంటి సినిమాలతో నటనతో ఆకట్టుకుంది.
(4 / 5)
అదా శర్మ ప్రస్తుతం 'ది కేరళ స్టోరీ' చిత్రం కారణంగా లైమ్‌లైట్‌లో ఉంది. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించింది. ‘ది కేరళ స్టోరీ’లో అదా శర్మ నటనకు ప్రశంసలు అందుతున్నాయి.
(5 / 5)
ఈ సినిమాలో అదా శర్మ చాలా బలమైన పాత్రలో నటించింది. సినిమాలో సాదాసీదాగా కనిపించే అదా శర్మ నిజ జీవితంలో చాలా గ్లామర్‌గా కనిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు