Merry Christmas: విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ జోడీగా మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్.. తెలుగు పండుగకు రిలీజ్-vijay sethupathi katrina kaif merry christmas release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Merry Christmas: విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ జోడీగా మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్.. తెలుగు పండుగకు రిలీజ్

Merry Christmas: విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ జోడీగా మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్.. తెలుగు పండుగకు రిలీజ్

Sanjiv Kumar HT Telugu

Vijay Sethupathi Merry Christmas: వర్సటైల్ అండ్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మరో బాలీవుడ్ మూవీ మేరీ క్రిస్మస్. తాజాగా సరికొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ మెర్రీ క్రిస్మస్ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్.

విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ మెర్రీ క్రిస్మస్ మూవీ విడుదల తేది ప్రకటన

Katrina Kaif Merry Christmas: తన నటన, హావాభావాలతో సౌత్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విలక్షణ నటుడు, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఈ మధ్య బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే షారుక్ ఖాన్‌కు విలన్‌గా జవాన్ మూవీతో అదరగొట్టిన విజయ్ సేతుపతి మరో హిందీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

విజయ్ సేతుపతి, బాలీవుడ్ హాట్ బ్యూటి కత్రీనా కైఫ్ జోడీగా నటించిన లేటెస్ట్ మూవీ మెర్రీ క్రిస్మస్. ఇప్పటికే అనేక పోస్టర్లతో క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా విడుదల తేదిని తాజాగా ప్రకటించారు. మొదటగా ఈ డిసెంబర్ క్రిస్మస్‌ ఫెస్టివల్ సందర్భంగా సినిమాను విడుదల చేద్దామనుకున్నారు. కానీ, పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది మెర్రీ క్రిస్మస్ సినిమా.

ఇప్పుడు ఎట్టకేలకు మెర్రీ క్రిస్మస్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 12న మేరీ క్రిస్మస్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. మేకర్స్. దీనికి సంబంధించిన పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. క్రైమ్ సీన్‌కు సంబంధించిన రిస్టిక్ట్రెడ్ ఏరియాలో కత్రీనా కైఫ్‌ను విజయ్ ప్రేమగా చూస్తూ ఉన్నాడు.

కాగా హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన మెర్రీ క్రిస్మస్ సినిమాకు బద్లాపూర్, అంధాదున్ వంటి హిట్ చిత్రాల డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. టిప్స్ ఫిల్మ్స్, మ్యాచ్ బ్యాక్స్ సమర్పిస్తున్నారు. దీనికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో సంజయ్ కపూర్, రాధికా ఆప్టే, పాఠక్ వినయ్, గాయత్రి శంకర్ తదితరులు నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ముంబైకర్ అనే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఈ సినిమా నేరుగా జియో సినిమా ఓటీటీలో విడుదలైంది. అయితే, నిజానికి విజయ్ సేతుపతి తొలి హిందీ చిత్రం మెర్రీ క్రిస్మస్. కానీ, పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇక ఇటీవల తొలి థియేట్రికల్ మూవీ జవాన్‌తో సాలిడ్ హిట్ కొట్టాడు విజయ్ సేతుపతి.