Ramam Raghavam: దర్శకుడిగా జబర్తస్త్ కమెడియన్ ధన్‌రాజ్ ద్విభాషా చిత్రం.. తమిళ హీరో కామెంట్స్
Bobby Simha About Ramam Raghavam: జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ధన్‌రాజ్ దర్శకుడిగా మారిన సినిమా రామం రాఘవ్. ఏప్రిల్ 27న ఈ సినిమా టీజర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమిళ హీరో బాబీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Jabardasth Dhanraj Ramam Raghavam: జబర్దస్త్ వంటి కామెడీ షోతో బాగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్, నటుడు ధన్‌రాజ్ కొరణాని. కమెడియన్ ధన్‌రాజ్ డైరెక్టర్‌గా మారి దర్శకత్వం వహించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రామం రాఘవం. బ్రో డైరెక్టర్, పాపులర్ యాక్టర్ సముద్ర ఖని, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను స్కేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ఆరిపాక సమర్పణలో నిర్మించారు.
తమిళ సెలబ్రిటీలు
ఈ సినిమాకు పృథ్వీ పోలవరపు నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 27న ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, తమిళ హీరో బాబీ సింహా, తంబి రామయ్య, హాస్య నటుడు సూరి, నటుడు దీపక్, నటుడు హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ అభిప్రాయాలను తెలిపారు.
సహాయం చేయాలి
"రామం రాఘవం టీజర్ బాగుంది. ధన్‌రాజ్ దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ముఖ్యంగా సముద్ర ఖనిని మెచ్చుకోవాలి. ఇలాగే అతను చాలా మందికి సహాయం చేసి.. ప్రోత్సహించాలి. రామం రాఘవం పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ బాలా తెలిపారు.
తండ్రీ కొడుకుల అనుబంధం
"సముద్ర ఖని అన్న సహాయం లేకుండా నేను ఈ సినిమా చేయలేను. ఈ సినిమా తీయడంలో ఖని అన్న చాలా ముఖ్యమైన వ్యక్తి. తండ్రీ కొడుకుల అనుబంధాల గురించి చెప్పే ఈ సినిమా బాగా వచ్చింది. జనాలకు నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని నిర్మాత పృథ్వీ పోలవరపు పేర్కొన్నారు.
ఇక ఈ చిత్రం అతనిది
"రామం రాఘవం దర్శకుడు ధనరాజ్ నా స్నేహితుడు. కష్టపడి పనిచేయడం అతని గొప్పతనం. తండ్రీ కొడుకుల అనుబంధం గురించి ఓ కథ చెప్పాడు. అద్భుతంగా ఉంది. తండ్రి క్యారెక్టర్ ఎవరని అడిగాను సముద్ర ఖని బ్రదర్ అని అన్నారు" అని తమిళ హీరో బాబీ సింహా చెప్పారు.
ఇకపై ఈ చిత్రం అతనిది. అతను ఈ చిత్రాన్నిపూర్తిగా క్యారీ చేసుకుంటాడు అని చెప్పా. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ధనరాజ్‌లో ఉన్న దర్శకుడిని చూసి చాలా ఆశ్చర్యపోయా" అని తమిళ హీరో, నటుడు బాబీ సింహా కామెంట్స్ చేశాడు.
తమిళంలో తొలి సినిమా
"తమిళంలో ఇది నా మొదటి సినిమా. తమిళ సినిమాలను ఇష్టపడే తమిళ అభిమానులు తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. తమిళ గడ్దలో తొలి అడుగు వేయడం ఆనందంగా ఉంది అని హీరోయిన్ మోక్ష చెప్పుకొచ్చారు.
అద్భుతంగా నటన
ఇక రామం రాఘవం సినిమా టీజర్ విషయానికొస్తే.. కామెడీతో ప్రారంభమై ఎమోషనల్‌గా ఎండ్ చేశారు. ధన్‌రాజ్, సముద్ర ఖని మధ్యలో వచ్చిన సీన్స్ చాలా బాగున్నాయి. మొదట్లో కామెడీతో నవ్వించగా సీరియస్ సన్నివేశాలు ఎమోషన్‌ను పలికించాయి. కొడుకును బాధ్యతగా నడుచుకోవాలనే తండ్రిగా సముద్ర ఖని నటన అద్భుతంగా ఉంది.
అమాయకపు పాత్ర
నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను. కానీ మంచి పేరు వాడే తెచ్చుకోవాలిగా అని సముద్ర ఖని చెప్పిన డైలాగా చాలా బాగుంది. అలాగే ధన్‌రాజ్ పాత్ర అమాయకంగా చూపించారు. అతని కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లో పర్వాలేదనిపించాడు. ఇలా ఆద్యంతం తండ్రీ కొడుకుల బంధాన్ని, ఎమోషన్‌ను చెప్పేలా టీజర్ సాగింది.