Tamil Hero: ఏడాదిలో 24 సినిమాలు, తమిళ హీరో క్రేజ్.. తెలుగులో పుట్టి కోలీవుడ్ ఇండస్ట్రీని ఏళుతూ!-tamil hero bobby simha about 24 movies in one year after jigarthanda im razakar promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamil Hero: ఏడాదిలో 24 సినిమాలు, తమిళ హీరో క్రేజ్.. తెలుగులో పుట్టి కోలీవుడ్ ఇండస్ట్రీని ఏళుతూ!

Tamil Hero: ఏడాదిలో 24 సినిమాలు, తమిళ హీరో క్రేజ్.. తెలుగులో పుట్టి కోలీవుడ్ ఇండస్ట్రీని ఏళుతూ!

Sanjiv Kumar HT Telugu
Mar 22, 2024 03:03 PM IST

Tamil Actor Bobby Simha Movies: ప్రభాస్ సలార్ మూవీలో భారవ వంటి ప్రముఖ పాత్రలో నటించి పేరు తెచ్చుకున్న తమిళ యాక్టర్ బాబీ సింహా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 24 సినిమాలు చేసి సత్తా చాటాడు. మరి తెలుగులో పుట్టి తమిళ ఇండస్ట్రీని ఏలుతున్న బాబీ సింహా వివరాల్లోకి వెళితే..

ఒక్క ఏడాదిలో 24 సినిమాలు చేసిన తమిళ హీరో.. తెలుగులో పుట్టి తమిళ ఇండస్ట్రీని ఏళుతూ!
ఒక్క ఏడాదిలో 24 సినిమాలు చేసిన తమిళ హీరో.. తెలుగులో పుట్టి తమిళ ఇండస్ట్రీని ఏళుతూ!

Tamil Actor Bobby Simha Movies: కొంతమంది హీరోలు, నటులు ఒక ఇండస్ట్రీకి చెందినవారు అయినప్పటికీ వారికి మరో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తుంటుంది. అలాంటి హీరోల్లో తమిళ నటుడు బాబీ సింహా ఒకరు. తమిళంలో హీరోగా, విలన్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న బాబీ సింహా తెలుగులోనూ పలు సినిమాల్లో యాక్టర్‌గా అలరించాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీలో భారవ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచతం అయ్యాడు.

తెలుగులో అగ్ర హీరోలతో

1983 నవంబర్ 6న సికింద్రాబాద్‌లో పుట్టిన బాబీ సింహా అసలు పేరు జయసింహా. క్రిష్ణా జిల్లా మోపిదేవికి చెందిన కుటుంబంలో పుట్టిన బాబీ సింహా 1995లో కొడైకెనాల్‌కు వలస వెళ్లిపోయారు. ఇక 2007లో మాయ కన్నడీ అనే సినిమాతో నటుడిగా డెబ్యూ చేశాడు. ఆ తర్వాత తమిళంలో పాపులర్ యాక్టర్‌గా సినీ ఇండస్ట్రీని ఏళుతున్నాడు. తెలుగులో రవితేజ డిస్కో రాజా, చిరంజీవి వాల్తేరు వీర్యయ సినిమాలో విలన్‌గా నటించాడు. ఇక ప్రభాస్ సలార్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబీ సింహా ఇటీవలే రజాకార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రజాకార్ మూవీ ప్రమోషన్స్

రజాకార్ మూవీకి ముందు ప్రమోషన్స్‌లో పాల్గొన్న బాబీ సింహా తాను ఏడాదిలో 24 సినిమాలు చేసినట్లు, ఒక సూపర్ హిట్ మూవీ కోసం చాలా గ్యాప్ వచ్చినట్లు ఆసక్తికర విషయాలు తెలిపాడు. "కేవలం జిగర్తాండా సినిమా వల్ల మూడు సినిమాలు హీరోగా చేయలేదు. జిగర్తాండా మూవీ కోసం ఒక ఏడాది ఎదురుచూశాను" అని బాబీ సింహా తెలిపాడు.

జిగర్తాండా మూవీ వల్ల

"సో ఆఫర్స్ వదిలేశావ్" అని యాంకర్ అంటే.. అవును, ముండాస్ పటేల్ అనే ఓ సినిమా చేయాలి. "నా కోసం సీవీ కుమార్ వెయిట్ చేశాడు. నిజానికి సీవీ కుమార్ యాక్టర్ కోసం వెయిట్ చేయడు. ఆయన ఫిక్స్ చేసిన డేట్‌కు ఇలా వెళ్లిపోతుంటాడు. అలాంటిది నా కోసం 3, 4 నెలలు ఎదురుచూశారు. నేను షేవ్ చేసుకోలేదు. ఇక ఒక్క రోజు పెండింగ్ ఉండిపోయింది జిగర్తాండలో" అని బాబీ సింహా అన్నాడు.

ఏడాదిలో 24 సినిమాలు

"సో దానికోసం (జిగర్తాండా మూవీ) మూడు నాలుగు సినిమాలు వదులుకున్నా. కానీ, నాకు తెలుసు.. ఒక కంటిన్యూగా హిట్ ఇచ్చే హీరోకు ఏం జరుగుతుందో.. అది నాకు జరుగుతుందని తెలుసు. సో కరెక్ట్‌గా అదే జరిగింది. జిగర్తాండ తర్వాత ఒక సంవత్సరంలో దాదాపుగా 24 సినిమాలు చేశాను. అన్ని భాషల్లో కలిపి. మళ్లీ ఆ తర్వాత స్టాప్ చేశాను. ఒక్కోటి చేసుకుంటూ వెళ్లాను. చూసుకుంటాం ఎలా చేశాం. ఏది ఎందుకు ఒప్పుకున్నాం అని ఆలోచించుకుంటూ వెళ్తాం కదా" అని బాబీ సింహా చెప్పుకొచ్చాడు.

4 రోజులకే ఆపేశాను

అనంతరం నాలుగు రోజులు షూటింగ్ చేసిన ఆపిన సినిమాలు కూడా ఉన్నాయని బాబీ సింహా తెలిపాడు. "ఇచ్చిన బాండెడ్ స్క్రిప్ట్‌లకు ఫైనల్ గ్రాఫ్ట్ ఇచ్చి.. ఇది రేపు షూటింగ్‌కు వెళ్తున్నాం అని అనుకుంటాం. కానీ, ఆ తర్వాత ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ జరుగుతాయి కదా. కానీ, సీన్స్ మార్చి ఏదైనా చేస్తే.. నేను చేయను. అలా నేను నాలుగు రోజులు షూటింగ్ చేసి ఆపేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కోర్టులో కేస్ కూడా నడుస్తున్నాయి. సో చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు" అని బాబీ సింహా పెర్కొన్నాడు.

Whats_app_banner