Chiranjeevi: భార్య సురేఖపై చిరంజీవి కవిత.. అదిరిన మెగాస్టార్ ప్రాస.. రేఖ.. రేఖ.. అంటూ!-chiranjeevi birthday wishes to his wife surekha konidela chiranjeevi poetry on surekha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: భార్య సురేఖపై చిరంజీవి కవిత.. అదిరిన మెగాస్టార్ ప్రాస.. రేఖ.. రేఖ.. అంటూ!

Chiranjeevi: భార్య సురేఖపై చిరంజీవి కవిత.. అదిరిన మెగాస్టార్ ప్రాస.. రేఖ.. రేఖ.. అంటూ!

Sanjiv Kumar HT Telugu
Feb 18, 2024 12:01 PM IST

Chiranjeevi Birthday Wishes To Wife Surekha: మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా అందమైన కవితను రాశారు. రేఖ.. రేఖ.. అంటూ అదిరిపోయే ప్రాసతో చిరు కవిత సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

భార్యపై చిరంజీవి కవిత.. అదిరిన మెగాస్టార్ ప్రాస.. రేఖ.. రేఖ.. అంటూ!
భార్యపై చిరంజీవి కవిత.. అదిరిన మెగాస్టార్ ప్రాస.. రేఖ.. రేఖ.. అంటూ!

Chiranjeevi Wife Surekha Birthday: మెగాస్టార్, పద్మ విభూషణ్ చిరంజీవిలో కవి బయటకు వచ్చాడు. ఒక్కసారిగా కాళీదాసులా మారి తన భార్య కోసం అందమైన ప్రేమ కవితను చెప్పాడు. సోషల్ మీడియాలో చిరంజీవి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. కొత్త సినిమాలకు విషెస్ తెలియజేస్తూ.. బాగున్న చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ పోస్టులు పెడుతుంటారు చిరంజీవి. ఇటీవల విశ్వంభర మూవీ కోసం వర్కౌట్స్ చేస్తూ రెడీ అవుతున్న పోస్టు పెట్టి ఇంటర్నెట్‌ను షేక్ చేశారు మెగాస్టార్.

ఇలా ఎప్పుడూ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చిరంజీవి మరోసారి తన పోస్టుతో అందరినీ అట్రాక్ట్ చేశారు. తాజాగా నేడు అంటే ఆదివారం (ఫిబ్రవరి 18) ఆయన సతీమణి సురేఖ కొణిదెల పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్ట్ పెట్టారు చిరంజీవి. సురేఖతో ప్రేమగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాకుండా తన భార్యపై ప్రేమతో అందంగా ఒక కవిత కూడా రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ కవిత, ఆ పోస్ట్ సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి.

"నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ! నా లైఫ్ లైన్‌ (జీవన రేఖ), నా బలానికి అతిగొప్ప పునాది సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సంతోషకరమైన రోజులు మరెన్నో జరుపుకోవాలి" అని చిరంజీవి రాసుకొచ్చారు. సురేఖ భుజంపై చిరు చేయి వేసి ప్రేమగా, అందమైన చిరునవ్వుతో ఉన్న మెగాస్టార్ దంపతుల ఫొటో నెటిజన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. దీంతో ఈ ఫొటో, కవిత్వం, పోస్ట్ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి కవిత చూసి ఆయన ప్రాస అదిరిపోయిందంటూ అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి ఇటీవల అమెరికాకు వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వాలంటైన్స్ డే సందర్భంగా భార్యతో కలిసి అమెరికాకు వెళ్లారు మెగాస్టార్. అయితే, ఆ అమెరికా ట్రిప్ భార్య బర్త్ డే సందర్భాంగానే అని టాక్ నడుస్తోంది. అమెరికా షార్ట్ ట్రిప్ వెనుక ఉన్న కారణం చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజే అంటూ నెట్టింట్లో చర్చ నడుస్తోంది.

కాబట్టి, భార్య బర్త్ డేను అమెరికాలో సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఈ టూర్ వేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి పెట్టిన పోస్ట్‌కు వేలల్లో లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దానిపై వరుణ్ తేజ్ స్పందిస్తూ బ్లాక్ హార్ట్ ఉన్న ఎమోజీని షేర్ చేశాడు. అంతేకాకుండా తాజాగా యూఎస్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో అల్లు అరవింద్, వెంకటేష్ ఇలా అందరూ కలిసి కనిపించారు. ఆ ఫొటోల్లో చిరంజీవి లుక్ చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. దీన్ని సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హనుమాన్ పాత్ర కీలకంగా ఉండనుందని ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. అలాగే ఆ గ్లింప్స్‌ ద్వారా సినిమా మూడు లోకాలకు సంబంధించినట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవిని భీమవరం దొరబాబుగా చూపిస్తున్నారని టాక్. విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేయనున్నారు.

Whats_app_banner