Abhishek Bachchan: తండ్రి మెగాస్టార్.. అయినా 38 ఫ్లాప్‌లు.. సెట్‌లో టీ పెట్టిన అభిషేక్ బచ్చన్ ఆస్తి ఎంతో తెలుసా?-abhishek bachchan has 38 films flop made tea on sets and abhishek bachchan net worth is around 300 crore ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Abhishek Bachchan Has 38 Films Flop Made Tea On Sets And Abhishek Bachchan Net Worth Is Around 300 Crore

Abhishek Bachchan: తండ్రి మెగాస్టార్.. అయినా 38 ఫ్లాప్‌లు.. సెట్‌లో టీ పెట్టిన అభిషేక్ బచ్చన్ ఆస్తి ఎంతో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Feb 15, 2024 12:22 PM IST

Abhishek Bachchan Net Worth With 38 Flops: సినీ ఇండస్ట్రీలోకి అగ్ర హీరో కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ 38 ఫ్లాప్స్ చవిచూశాడు. అంతేకాకుండా మూవీ సెట్‌లో అందరికీ టీ పెట్టి ఇచ్చాడు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ ఆస్తి వివరాల్లోకి వెళితే..

పేరుకు స్టార్ హీరో కొడుకు, 38 ఫ్లాప్‌లు.. సెట్‌లో టీ పెట్టిన అభిషేక్ బచ్చన్ ఆస్తి ఎంతో తెలుసా?
పేరుకు స్టార్ హీరో కొడుకు, 38 ఫ్లాప్‌లు.. సెట్‌లో టీ పెట్టిన అభిషేక్ బచ్చన్ ఆస్తి ఎంతో తెలుసా?

Abhishek Bachchan Net Worth: స్టార్ హీరోల వారసులకు ఫస్ట్ మూవీకి ఎలాంటి ఫలితం వచ్చినా రెండో సినిమాకు ఛాన్స్ దొరికే అవకాశం కాస్తా ఎక్కువే. లేదా సొంత బ్యానర్‌లో సినిమాలు తెరకెక్కించి నటనపరంగా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. అలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు వచ్చినా వారసత్వం కారణంగానో, ఇంకేదైనా కారణాలతో వారికి సినిమా ఛాన్సెస్ వస్తాయి. కానీ, అవి హిట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. ఎప్పటికీ డిజాస్టర్ హీరోగా పేరు తెచ్చుకోవచ్చు.

కానీ, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. డిజాస్టర్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరోనే కూడా వందల కోట్ల నెట్‌వర్త్‌తో ఆశ్చర్యపర్చొచ్చు. అలా ఏకంగా 38 ఫ్లాప్స్‌తో కెరీర్‌ను కొనసాగించిన ఓ స్టార్ హీరో కొడుకు ప్రస్తుతం నికర ఆస్తి విలువ రూ. 280 కోట్లు. ఆ హీరో ఎవరో కాదు.. అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నట వారసుడు అభిషేక్ బచ్చన్ గురించే మనం మాట్లాడుకుంది.

నటనకు ప్రశంసలు

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ తొలి సినిమా రెఫ్యూజీ. జేపీ దత్తా రూపొందించిన వార్ డ్రామా మూవీలో కరీనా కపూర్‌కు జోడీగా అభిషేక్ బచ్చన్ హీరోగా అడుగుపెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ, నటీనటులకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan Flop Movies) నటించిన 8 సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

అనంతరం జాన్ అబ్రహం, ఉదయ్ చోప్రా నటించిన ధూమ్ మూవీతో మొదటి హిట్ అందుకున్నాడు అభిషేక్ బచ్చన్. అయితే ఇది మల్టీ స్టారర్ మూవీ. కానీ, అభిషేక్ బచ్చన్ సోలో హీరోగా హిట్ కొట్టింది మాత్రం బంటీ ఔర్ బబ్లీ మూవీతో. 2005లో వచ్చిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ హీరోయిన్‌గా చేసింది. దీన్నే తెలుగులో భలే దొంగలు టైటిల్‌తో రీమేక్ చేశారు. బంటీ ఔర్ బబ్లీ మూవీలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఓ సాంగ్‌లో నర్తించిన విషయం తెలిసిందే.

ఓటీటీలో ఆకట్టుకుని

ఇదిలా ఉంటే 23 ఏళ్ల కెరీర్‌లో అభిషేక్ బచ్చన్ 29 ఫ్లాప్ల్ చూశాడు. హ్యాపీ న్యూ ఇయర్, ధూమ్ 2, ధూమ్ 3, హౌజ్‌ఫుల్ 3, దోస్తానా సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్న అవన్నీ మల్టీ స్టారర్ సినిమాలే. అయితే 2020లో మాత్రం బీత్ ఇంటు ది షాడోస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ హిట్ అందుకున్నాడు. ఇందులో అభిషేక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అనంతరం ది బిగ్ బుల్, దస్వీ, బాబ్ బిస్వాస్ సినిమాలతో ఓటీటీలో ఆకట్టుకున్నాడు.

అయితే, అభిషేక్ బచ్చన్ థియేట్రికల్ కమ్ బ్యాక్ మూవీ ఘూమర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకోపోయింది. కానీ, ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 280 కోట్లకు (Abhishek Bachchan Net Worth) చేరుకున్నట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం అభిషేక్ బచ్చన్ ప్రతి నెల దాదాపుగా రూ. 2 కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక్కో చిత్రానికి రూ. 10 నుంచి 12 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. అంతేకాకుండా ప్రో కబడ్డీ లీగ్ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్‌కు ఓనర్. దాని విలువ రూ. 100 కోట్లు అని తెలుస్తోంది.

చాలా నష్టపోయి

ఇదిలా ఉంటే ఒక సమయంలో అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. దాంతో చదువుకు స్వస్తి చెప్పి తండ్రికి సహాయం చేద్దామన్న ఉద్దేశంతో సినిమాల్లోకి రాకముందు ప్రొడక్షన్ బాయ్‌గా చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తెలిపాడు. "అప్పట్లో నాన్న కంపెనీ పెట్టడం వల్ల చాలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం. అందులో ఆయన చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నా చదువుకుంటే నాన్నను ఆదుకోవాలని ఎక్కువగా అనిపించింది"అని అభిషేక్ బచ్చన్ తెలిపాడు.

అందుకే తాను సినిమాల్లోకి రాకముందు ప్రొడక్షన్ బాయ్‌గా మారానని, సినిమా సెట్స్‌లో నటీనటులకు టీ పెట్టేవాడినని అభిషేక్ బచ్చన్ వెల్లడించాడు. తరువాత, అతను పరిశ్రమలో ప్రొడక్షన్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు అభిషేక్ బచ్చన్. కాగా 60 సినిమాల్లో నటించిన అభిషేక్ బచ్చన్ 38 ఫ్లాప్స్ చూశాడు. హిట్స్ మాత్రం ఉన్న సోలో హిట్ ఎక్కువగా లేకపోవడం గమనార్హం.

IPL_Entry_Point