Amardeep Supreetha Movie: బిగ్ బాస్ అమర్‌దీప్, సురేఖ వాణి కూతురు సుప్రీత మూవీ ప్రారంభం-amardeep supreetha movie launched today february 1st with pooja ceremony tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amardeep Supreetha Movie: బిగ్ బాస్ అమర్‌దీప్, సురేఖ వాణి కూతురు సుప్రీత మూవీ ప్రారంభం

Amardeep Supreetha Movie: బిగ్ బాస్ అమర్‌దీప్, సురేఖ వాణి కూతురు సుప్రీత మూవీ ప్రారంభం

Hari Prasad S HT Telugu

Amardeep Supreetha Movie: బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత కలిసి నటిస్తున్న సినిమా ప్రారంభమైంది. గురువారం (ఫిబ్రవరి 1) పూజా కార్యక్రమాలు జరిగాయి.

అమర్ దీప్, సుప్రీతలపై క్లాప్ కొడుతున్న బసిరెడ్డి

Amardeep Supreetha Movie: బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా, నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా నూతన చిత్రం ప్రారంభం అయింది. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి ప్రొడక్షన్ నెం 2గా మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గురువారం (ఫిబ్రవరి 1) హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టగా.. ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.

అమర్‌దీప్, సుప్రీత మూవీ

పూజా కార్యక్రమాలతో అమర్ దీప్, సుప్రీత మూవీ లాంఛనంగా ప్రారంభమైన తర్వాత మూవీ టీమ్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. ‘ఎం3 బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం. 2 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అమర్ దీప్ చౌదరి, సుప్రితలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమాలో ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్. ఈ చిత్రాన్ని మా దర్శకుడు ఎలా తీస్తాడు.. సినిమా ఎలా ఉంటుందన్నది తర్వాత తెలుస్తుంది. ఇది మాత్రం చాలా కొత్త పాయింట్’ అని అన్నారు.

ఇక దర్శకుడు మాల్యాద్రి రెడ్డి మాట్లాడుతూ.. ‘మా లాంటి కొత్త వాళ్ళని ఎం3 మీడియా ఎంతో ప్రోత్సహించింది. ఇంకా మాలాంటి కొత్త వాళ్ళని, యంగ్ టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నాడు. మూవీ హీరో, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ కంటే ముందే ఈ చిత్రాన్ని ఓకే చేశాను.

డైరెక్టర్ మాల్యా నా ఫ్రెండ్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒప్పుకున్న సినిమా అయితే కాదు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు సైన్ చేసి వెళ్లాను. చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ నా కోసం రాసుకున్నారు. నా కోసమే డిజైన్ చేశారు. థాంక్యూ మాల్యా. మహేంద్ర గారి సపోర్ట్‌ను ఎప్పుడూ మరచిపోలేను. ఆయన ఆర్టిస్టులకు ఎంతో గౌరవం ఇస్తుంటారు. సుప్రీతతో పని చేస్తుండడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎలా ఉండబోతోందని మేం చెప్పడం కంటే.. మూవీ చూసి మీరే చెప్పాలి. మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు వచ్చిన వారందరికీ థాంక్స్’ అని అన్నాడు.

హీరోయిన్ సుప్రీత మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అమర్ దీప్ తో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఇక్కడకు వచ్చిన అందరికీ థాంక్స్’ అని చెప్పింది.

సురేఖా వాణి మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్ విన్న తర్వాత చేస్తారా? లేదా? అని అనుమానం వచ్చింది. రఘు డార్లింగ్ వల్లే ప్రాజెక్ట్ ముందుకు వెళ్లింది. దర్శక నిర్మాతల మీద నమ్మకంతోనే నా బిడ్డను వాళ్ల చేతుల్లో పెట్టాను. అందుకే ఈ చిత్రానికి ఒప్పుకున్నాను. అమర్ దీప్, సుప్రీతలను ఆశీర్వదించడానికి ఇంత మంది రావడంతో ఇదే పెద్ద విజయంలా అనిపించింది’ అని చెప్పింది.