Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ చరిత్రలోనే ఇది తొలిసారి. ఒక బిగ్ బాస్ విన్నర్‌పై బుక్ రావడం అనేది ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. అలాంటి ఓ కంటెస్టెంట్‌పై పుస్తకం రావడం అనేది చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతను సాధించాడు బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్, రన్నరప్ అమర్ దీప్ చౌదరి.
డిసెంబర్ 17న జరిగిన బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలేలో టైటిల్ కోసం పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ పోటీపడగా.. విజేతగా రైతుబిడ్డ నిలిచాడు. అయితే గ్రాండ్ ఫినాలే రాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవతో ప్రశాంత్ ఒక్కసారిగా జీరో అయిపోయాడు. హౌజ్‌లో ఎంతోమందితో ముఖ్యంగా శివాజీతో పనికిమాలినోడా అనిపించుకున్న అమర్ దీప్ అసలైన విజేత అయ్యాడు.
తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ న్యూ ఇయర్ పార్టీ (Aadivaaram with StarMaa Parivaaram Starwars New Year Party) ప్రోమోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీవీ సీరియల్స్ నటీనటులతోపాటు హనుమాన్ మూవీ టీమ్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రియాంక జైన్, శోభా శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే అమర్ దీప్‌కు ఫ్యాన్ మూమెంట్ దక్కింది.
అమర్ దీప్ కోసం ఓ అభిమాని ఏకంగా పుస్తకం రాసి తీసుకొచ్చాడు. బుక్ అంటే చాలా పేజీలు ఉండే బుక్ కాదు. కొన్ని పేజీలతో చేసిన స్పైరల్ బైండింగ్ బుక్. "అందరికీ మీరు రన్నర్ కావచ్చు. మాకు మాత్రం మీరు ఎప్పటికీ విన్నరే అన్నా.. అమర్ అన్న తోపు.. దమ్ముంటే ఆపు" అని ఆ అభిమాని అమర్‌కు బుక్ ప్రజెంట్ చేశాడు. దాంతో అమర్ దీప్ చాలా సంతోషించాడు.
"ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై బుక్ వచ్చిందంటే.. మా తమ్ముడు సాధించాడ్రా" అంటూ శ్రీముఖి అరుస్తూ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ న్యూ ఇయర్ పార్టీ ప్రోమో వైరల్ అవుతోంది. మరి ఇది చూసి అమర్‌ను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడిన శివాజీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.