Chiranjeevi OTT: ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ? ఆ ప్లాట్‌ఫామ్‌తో వెబ్ సిరీస్.. ఇది పెద్ద ప్లానింగే!-tollywood megastar chiranjeevi ott debut with netflix web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Ott: ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ? ఆ ప్లాట్‌ఫామ్‌తో వెబ్ సిరీస్.. ఇది పెద్ద ప్లానింగే!

Chiranjeevi OTT: ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ? ఆ ప్లాట్‌ఫామ్‌తో వెబ్ సిరీస్.. ఇది పెద్ద ప్లానింగే!

Sanjiv Kumar HT Telugu
Feb 09, 2024 04:49 PM IST

Chiranjeevi OTT Debut: ఇప్పటివరకు వెండితెరపై అదరగొట్టి బాస్‌గా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి చిరంజీవి ఏ ఓటీటీతో ఎంట్రీ ఇవ్వనున్నారు, ఎలాంటి సిరీస్ చేయనున్నారనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ? ఆ ప్లాట్‌ఫామ్‌తో వెబ్ సిరీస్.. ఇది పెద్ద ప్లానింగే!
ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ? ఆ ప్లాట్‌ఫామ్‌తో వెబ్ సిరీస్.. ఇది పెద్ద ప్లానింగే!

Chiranjeevi OTT Web Series: ప్రస్తుతం ఓటీటీల హవా ఎలా నడుస్తుందో తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ సమయం నుంచి ఓటీటీ వేదికల వాడకం ఎక్కువైంది. డిఫరెంట్ జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు, సరికొత్త కంటెంట్‌తో ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆకర్షించాయి. దాంతో భాషా బేధం లేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి ఇతర భాషా చిత్రాలను వీక్షించారు మూవీ లవర్స్, ఆడియెన్స్. ఈ మధ్య కాలంలో వీటి హవా పెరగడంతో స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్‌గా పాపులర్ అయిన సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతార తదితరులు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సిరీసుతో ఓటీటీ డెబ్యూ చేశాడు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ డెబ్యూ ఇవ్వనున్నారని ఓ టాక్ జోరుగా నడుస్తోంది. లాక్ డౌన్ సమయంలో, ఇటీవల మెకాలి సర్జరీ కారణంగా ఇంట్లో విరామ సమయంలో ఓటీటీ కంటెంట్‌ను బాగా వీక్షించారట చిరంజీవి.

అలా వీక్షించే సమయంలో ఓ ఓటీటీటీ సిరీస్ చేస్తే బాగుంటేదేమో అనే ఆలోచన చిరంజీవికి వచ్చినట్లు ఆయన టీమ్ మెంబర్స్ చెప్పినట్లు సమాచారం. ఆ మధ్య చిరంజీవి ఓటీటీలవైపు చూస్తున్నారని ప్రచారం జరగ్గా.. తాజాగా ఆయన ఓ సిరీసుతో ఓటీటీలోకి అడుగుపెడుతున్నారనే న్యూస్ జోరుగా సాగుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చిరంజీవి ఓ వెబ్ సిరీస్ చేయనున్నారని ఆ న్యూస్ సారాంశం. అయితే ఎలాంటి సిరీస్ చేస్తున్నారనే విషయంపై క్లారిటీ లేదు.

అయితే చిరంజీవి నిజాంగానే ఓటీటీ సిరీస్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిరీస్ జోనర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ ఇలా ఏ విషయంపై క్లారిటీ లేదు గానీ వార్తలు మాత్రం తెగ గింగిరాలు తిరుగుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ మెగాస్టార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తే అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ పూనకాలు మొదలు అవుతాయి. ఇక చిరంజీవి గ్రేస్, యాక్టింగ్‌ను గ్లోబల్ వైడ్‌గా చూసే అవకాశం ఉంటుంది.

కాగా ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారాండోస్‌ను స్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ ఇద్దరు కలిశారు. ఈ వార్త వైరల్ కాగా నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ కోసమే ముగ్గురు సమావేశం అయ్యారని టాక్ లేచింది. చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ తన మార్కెట్‌ను మరింత విస్తృతం చేసుకునేందుకే చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేయడానికి రెడీగా ఉందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ నెట్ ఫ్లిక్స్‌తో చిరంజీవి వెబ్ సిరీస్, ఓటీటీ ఎంట్రీపై అధికారికమైన స్పష్టత అయితే లేదు.

ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. కల్యాణ్ రామ్ సూపర్ హిట్ కొట్టిన బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే విశ్వంభర. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా ఈపాటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. విశ్వంభర చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఓ కీ రోల్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో చిరంజీవి దొరబాబుగా కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.