Kajal Aggarwal: ఇండియన్ 2 నుండి కాజల్ అగర్వాల్ ఔట్ ? -kajal aggarwal opts out of kamal haasan s indian 2 movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kajal Aggarwal Opts Out Of Kamal Haasan's Indian 2 Movie

Kajal Aggarwal: ఇండియన్ 2 నుండి కాజల్ అగర్వాల్ ఔట్ ?

HT Telugu Desk HT Telugu
Jul 07, 2022 06:41 AM IST

ప్రెగ్నెన్సీ కార‌ణంగా నాగార్జున ది ఘోస్ట్ సినిమా మ‌ధ్య‌లో ఉండ‌గానే వైదొలిగింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. తాజాగా మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమా నుండి ఆమెను త‌ప్పించనున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌
కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (instagram)

విక్రమ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు కమల్ హాసన్. ఈ ఉత్సాహంలోనే ఇండియన్ 2 సినిమాను తిరిగి సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకనిర్మాత‌ల‌కు మ‌ధ్య నెలకొన్న విభేదాల కార‌ణంగా ఇండియన్ 2 షూటింగ్ ఏడాది క్రితం నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ గొడ‌వ‌లు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆగ‌స్ట్ నెలలో ఇండియన్ 2 షూటింగ్ ను తిరిగి ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 2019లో లాంఛ‌నంగా ఈ సినిమా మొద‌లైంది.

క‌మ‌ల్‌హాస‌న్ ను మ‌రోసారి సేనాప‌తి పాత్ర‌లో చూపిస్తూ ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ల‌ను హీరోయిన్లుగా తీసుకున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంపై ప‌లు కీల‌క‌మైన సన్నివేశాలను చిత్రీక‌రించారు. చెన్నైలో షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో సెట్స్ లో క్రేన్ కూలి పోవ‌డంతో ముగ్గురు చిత్ర యూనిట్ స‌భ్యులు మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదం నుండి తృటిలో క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న కార‌ణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో విభేదాలు త‌లెత్త‌డంతో షూటింగ్ నిలిచింది. ఈ విభేదాల కారణంగా ఇండియన్ 2 తిరిగి మొద‌లుకావ‌డం క‌ష్ట‌మేనంటూ వార్త‌లొచ్చాయి.

విక్ర‌మ్ స‌క్సెస్ నేప‌థ్యంతో ఇండియ‌న్ 2ను షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు కొంత‌కాలంగా క‌మ‌ల్‌హాస‌న్ గట్టిగా ప్రయత్నాలు చేశారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో విడివిడిగా ముచ్చ‌టించి ఇద్ద‌రి మ‌ధ్య కమల్ స‌యోధ్య కుదిర్చిన‌ట్లు తెలిసింది. క‌మ‌ల్‌హాస‌న్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ఇండియన్ 2 సినిమాను పూర్తిచేయ‌డానికి శంక‌ర్ అంగీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆగ‌స్ట్ నెల‌లో షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. కాగా పాత్రలు, బడ్జెట్ పరంగా సినిమాలో చాలా మార్పులు చేయబోతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ సినిమా నుండి త‌ప్పించే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో మ‌రో హీరోయిన్ ను తీసుకోబోతున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే కాజ‌ల్ త‌ల్లిగా మారింది. పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ 2023 నుండి రీఎంట్రీ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. అందువల్లే ఆమె స్థానంలో మ‌రో నాయిక‌ను చిత్ర యూనిట్ ఎంపిక‌చేయ‌బోతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. నాగార్జున ది ఘోస్ట్ సినిమా షూటింగ్ మ‌ధ్యంలో ఉండ‌గానే సినిమా నుండి త‌ప్పుకున్న‌ది కాజ‌ల్‌. ఇప్పుడు భార‌తీయుడు నుండి ప‌క్క‌న‌పెట్ట‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్