Thandel Glimpse: ఇక రాజులమ్మ జాతరే.. రగ్గడ్ లుక్‌లో నాగ చైతన్య.. తండేల్ గ్లింప్స్ అదుర్స్-naga chaitanya essence of thandel first glimpse released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel Glimpse: ఇక రాజులమ్మ జాతరే.. రగ్గడ్ లుక్‌లో నాగ చైతన్య.. తండేల్ గ్లింప్స్ అదుర్స్

Thandel Glimpse: ఇక రాజులమ్మ జాతరే.. రగ్గడ్ లుక్‌లో నాగ చైతన్య.. తండేల్ గ్లింప్స్ అదుర్స్

Sanjiv Kumar HT Telugu
Jan 06, 2024 12:29 PM IST

Thandel Glimpse: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జోడీ కట్టిన సినిమా తండేల్. దీని నుంచి రావాల్సిన ఫస్ట్ గ్లింప్స్ కాస్తా ఆలస్యంగా జనవరి 6న విడుదల చేశారు. ఎస్సెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇక రాజులమ్మ జాతరే.. రగ్గడ్ లుక్‌లో నాగ చైతన్య.. తండేల్ గ్లింప్స్ అదుర్స్
ఇక రాజులమ్మ జాతరే.. రగ్గడ్ లుక్‌లో నాగ చైతన్య.. తండేల్ గ్లింప్స్ అదుర్స్

Essence Of Thandel Glimpse: యువ సామ్రాట్, అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం తండేల్. కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తుండంతో మరింత బజ్ నెలకొంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ కట్టిన తండేల్ మూవీని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు టాక్.

తండేల్ మూవీలో ఎన్నడు చేయని మత్సకారుడి పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నాడు. గత నెలలో తండేల్ మూవీ షూటింగ్ మొదలు కాగా ఇప్పటివరకు అప్డేట్స్ రాలేదు. ఈ నేపథ్యంలో జనవరి 5న ఎస్సెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ఎస్సెన్స్ ఆఫ్ తండేల్ తీసుకొస్తామని మూవీ టీమ్ చెప్పారు. కానీ చెప్పినట్లుగా గ్లింప్ల్స్ విడుదల చేయలేదు మేకర్స్. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు.

అనంతరం తండేల్ ఫస్ట్ గ్లింప్స్ ఆలస్యం అవుతున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. అయితే జనవరి 6న ఉదయం 11 గంటల సయమంలో తండేల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. 2 నిమిషాల 11 సెకన్లపాటు సాగిన ఈ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఇంటెన్సివ్‌గా ఉంది. శ్రీకాకుళం యాసలో నాగ చైతన్య డైలాగ్స్ బాగున్నాయి. దద్దా.. గుర్తెట్టుకో.. ఈ పాలి యేట.. గురి తప్పేదేలేదేస్.. ఇక రాజులమ్మ జాతరే అంటూ నాగ చైతన్య డైలాగ్‌తో ప్రారంభమైన గ్లింప్స్ చాలా ఆసక్తిగా ఉంది.

ఇక్కడ సీన్ కట్ చేస్తే పాకిస్తాన్‌లోని కరాచీ సెంట్రల్ జైలులో నాగ చైతన్య ఖైదీగా ఉంటాడు. 22 మంది మత్స్యకారులను కరాచీ జైలులో వేసినట్లు పేపర్స్ చూపిస్తారు. అందులో నాగ చైతన్య కూడా ఉంటాడు. తర్వాత భారత జాతీయ జెండాను విపరీతమైన దెబ్బలతో ఉన్న నాగ చైతన్య తాకుతూ ఉంటే "ఏంట్రా దేశభక్తా. అది కూడా మీ దేశానికే" అని పోలీస్ అంటాడు. "మా నుండి విడిపోయిన ముక్క.. మీకే అంత ఉంటే.. ఆ ముక్కను విసిరేసిన మాకు ఎంత ఉండాలి. నీ పాకిస్తాన్ అడ్డపై నేను చెబుతున్నా.. భారత్ మాతాకీ జై" అని చైతూ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

అనంతరం బుజ్జి తల్లి.. వచ్చేత్తున్నా కదే.. కాత్తా నవ్వే.. అని నాగ చైతన్య చెబుతుంటే.. సాయి పల్లవిని చూపించారు. సాయి పల్లవి నవ్వుతూ ఎంతో అందంగా కనిపించింది. ఇలా వావ్ అనిపించేలా తండేల్ ఫస్ట్ గ్లింప్స్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింతగా హైప్ ఇచ్చింది. ఇందులో చైతూ రగ్గడ్ లుక్‌లో అట్రాక్ట్ చేశాడు. దీంతో అక్కినేని అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. కాగా తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తండేల్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు 2018 నవంబర్‌లో గుజరాత్‌లో సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు పాకిస్తాన్ దళాలు తీసుకెళ్లి జైల్లో బంధిస్తాయి. ఆ తర్వాత వారిని విడిపించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. చివరికి 2020 జనవరిలో ఆ మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్‌తో తండేల్ సినమా తెరకెక్కింది.

Whats_app_banner