Jai Hanuman Yash: ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్?-yash in jai hanuman movie as hanuman role yash is join in prasanth varma cinematic universe ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jai Hanuman Yash: ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్?

Jai Hanuman Yash: ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్?

Sanjiv Kumar HT Telugu
Feb 15, 2024 10:24 AM IST

Clarity On Yash In Jai Hanuman Movie: తెలుగు ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హనుమాన్ మూవీకి సీక్వెల్‌గా జై హనుమాన్ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తోన్న ఈ జై హనుమాన్ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్?
ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్?

Yash In Jai Hanuman Movie: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మొదట చిన్న సినిమాగా స్టార్ట్ అయి విడుదల అయ్యేవరకు పాన్ వరల్డ్ మూవీగా భారీ చిత్రంగా ఎదిగింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

చాలా గ్రాండ్‌గా విడుదలైన జై హనుమాన్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ కొత్త సినిమాలకు పోటీగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే హనుమాన్ మూవీకి సీక్వెల్‌గా జై హనుమాన్ సినిమా రానున్నట్లు క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చారు. అది నిజం అని హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్‌లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా చెప్పాడు. అంతేకాకుండా హనుమాన్ మూవీకి వంద రెట్లు అధికంగా జై హనుమాన్ ఉంటుందని భారీ అంచనాలు పెంచేశాడు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రెండే సినిమాగా జై హనుమాన్ రానుంది. ఇప్పటికే జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా ఉన్నారు. అయితే ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కేజీఎఫ్ హీరో, కన్నడ అగ్ర హీరో యశ్ భాగం కానున్నాడని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. జై హనుమాన్ చిత్రంలో హనుమంతుగా తేజ సజ్జా మరోసారి కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ మొత్తం హనుమంతుడి పాత్ర చుట్టూ తిరగనుందని తెలిసిందే.

దాంతో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎవరు చేయనున్నారనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై చాలా హీరోల పేర్లు వచ్చాయి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడిగా నటిస్తున్నారంటూ టాక్ వచ్చింది. కానీ, అందులో నిజం లేదని తర్వాత తెలిసిపోయింది. ఇప్పుడు యశ్ ఆ పాత్రలో కనిపిస్తారని తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో జై హనుమాన్ మూవీపై మరించ బజ్ క్రియేట్ అయింది.

కానీ, హనుమంతుడి పాత్రలో యశ్ నటిస్తున్నాడన్న వార్తల్లో నిజం లేదని తాజాగా క్లారిటీ వచ్చింది. అలాంటి పాత్ర చేయడానికి యశ్ సిద్దంగా లేడని సన్నిహితుల నుంచి ఓ సమాచారం వచ్చినట్లుగా పలు సైట్స్ పేర్కొన్నాయి. ప్రస్తుతం యశ్ తన అప్ కమింగ్ మూవీ టాక్సిక్‌పైనే ఉందని తెలుస్తోంది. ఇదే కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి తెరకెక్కిస్తున్న రామయణం మూవీలో రావణాసురిడి పాత్రలో యశ్ నటిస్తున్నారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా దగ్గుబాటి రానా కనిపిస్తారని మరో టాక్ నడుస్తోంది. ఎందుకుంటే హనుమాన్ ఎండ్ టైటిల్స్‌కు ముందు వచ్చిన సీన్‌లో హనుమంతుడి కళ్లు అచ్చం రానా దగ్గుబాటిలా ఉన్నాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దాంతో రానానే హనుమంతుడిగా నటిస్తారనే వార్త గట్టిగా వినిపిస్తోంది. మరి చూడాలి జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా ఏ స్టార్ హీరో నటిస్తారో అనేది.

Whats_app_banner