Maharaja First Review: మ‌హారాజా ఫ‌స్ట్ రివ్యూ - చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ సేతుప‌తి మూవీకి హిట్ టాక్‌-vijay sethupathi maharaja first review and premiers talk ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maharaja First Review: మ‌హారాజా ఫ‌స్ట్ రివ్యూ - చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ సేతుప‌తి మూవీకి హిట్ టాక్‌

Maharaja First Review: మ‌హారాజా ఫ‌స్ట్ రివ్యూ - చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ సేతుప‌తి మూవీకి హిట్ టాక్‌

Maharaja First Review: విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తోన్న మ‌హారాజా మూవీ జూన్ 14న (శుక్ర‌వారం) రిలీజ్ అవుతోంది. ఈ యాక్ష‌న్ డ్రామా మూవీలో మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, అనురాగ్ క‌శ్య‌ప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

మ‌హారాజా మూవీ

Maharaja First Review: విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తోన్న 50వ మూవీ మ‌హారాజా ఈ శుక్ర‌వారం (జూన్ 14న‌) త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. యాక్ష‌న్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి నితిల‌న్ సామినాథ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, అనురాగ్ క‌శ్య‌ప్ కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌హారాజా మూవీ ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్ ల‌భించింది. ఈ టాక్ ఎలా ఉందంటే?

బార్బ‌ర్ పోలీస్ కంప్లైంట్‌....

మ‌హారాజా మూవీ ప్రీమియ‌ర్స్‌లో విజ‌య్ సేతుప‌తి యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తోన్నాయి. ఇందులో మ‌హారాజా అనే బార్బ‌ర్‌గా విజ‌య్ సేతుప‌తి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టాడ‌ని చెబుతోన్నారు. మ‌హారాజా ఓ బార్బ‌ర్‌. త‌న కూతురు జ్యోతితో క‌లిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు.

త‌న ఇంటిపై ఓ ముగ్గురు వ్య‌క్తులు ఎటాక్ చేసి త‌న‌తో పాటు కూతురి గాయ‌ప‌రిచార‌ని కంప్లైంట్ ఇస్తాడు. ఈ ఎటాక్‌లో త‌న ల‌క్ష్మి మిస్స‌యింద‌ని, వెతికిపెట్ట‌మ‌ని కంప్టైంట్‌లో పేర్కొంటాడు. ఇంత‌కీ మ‌హారాజా చెప్పిన ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మ‌హారాజా కంప్లైంట్ చూసి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? అత‌డి ఇంటిపై ఎటాక్ చేసింది ఎవ‌రు అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్లు నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు.

రివేంజ్ యాక్ష‌న్ డ్రామా...

రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా ద‌ర్శ‌కుడు నితిల‌న్ సామినాథ‌న్ ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా మొత్తం క‌నిపించ‌కుండా పోయిన ఓ డ‌స్ట్‌బిన్ చుట్టూ తిరుగుతుంద‌ని చెబుతున్నారు. డ‌స్ట్‌బిన్ పోయింద‌ని ఓ వ్య‌క్తి పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వ‌డం, ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌ను ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌రంగా చూపించార‌ని అంటున్నారు.

క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్‌...

సింపుల్ పాయింట్‌తో మొద‌లై ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో మూవీ సాగుతుంద‌ని, ముఖ్యంగా క్లైమాక్స్ లో వ‌చ్చే మ‌లుపు అదిరిపోతుంద‌ని చెబుతోన్నారు. ఈ సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్స్‌లు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయ‌ని నెటిజ‌న్లు అంటోన్నారు.

విజ‌య్ సేతుప‌తి కెరీర్‌లో బెస్ట్ మూవీ...

సింపుల్ క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌, వేరియేష‌న్స్‌, అత‌డి కామెడీ టైమింగ్ మ‌హారాజా మూవీని చాలా వ‌ర‌కు నిల‌బెట్టాయ‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. విజ‌య్ సేతుప‌తి కెరీర్‌లోనే బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా మ‌హారాజా నిలుస్తుంద‌ని అంటున్నారు. విల‌న్‌గా అనురాగ్ క‌శ్య‌ప్ కూడా...విజ‌య్ సేతుప‌తికి ధీటుగా యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచాడ‌ని చెబుతోన్నారు. మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, న‌ట్టి న‌ట‌రాజ్‌తో పాటు ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడ‌ని ట్వీట్స్ చేస్తున్నారు.

ఫ‌స్ట్ హాఫ్ స్లో...

ఫ‌స్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంద‌ని, క‌థ‌లోని వెళ్ల‌డానికి డైరెక్ట‌ర్ చాలా టైమ్ తీసుకున్నాడ‌ని చెబుతోన్నారు. సెకండాఫ్ మాత్రం ఎక్స్‌ట్రార్డిన‌రీగా సాగుతుంద‌ని అంటున్నారు. మ‌ల‌యాళంలో మాత్ర‌మే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో కూడిన సినిమాలు వ‌స్తాయ‌ని అనుకునేవారికి మంచి ఆన్స‌ర్‌గా ఈ మూవీ నిలుస్తోంద‌ని చెబుతోన్నారు.