Vijay Sethupathi: మహారాజ కోసం విజయ్ సేతుపతి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదా? కారణం ఇదే-vijay sethupathi actred in maharaja movie for free without remuneration kollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Sethupathi: మహారాజ కోసం విజయ్ సేతుపతి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదా? కారణం ఇదే

Vijay Sethupathi: మహారాజ కోసం విజయ్ సేతుపతి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదా? కారణం ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 31, 2024 03:15 PM IST

Vijay Sethupathi - Maharaja Movie: మహారాజ చిత్రంలో మరోసారి తన నటనతో మెప్పించారు విజయ్ సేతుపతి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ అయింది. అయితే, ఈ సినిమా కోసం సేతుపతి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

Vijay Sethupathi: మహారాజ కోసం విజయ్ సేతుపతి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదా? కారణం ఇదే
Vijay Sethupathi: మహారాజ కోసం విజయ్ సేతుపతి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదా? కారణం ఇదే

మహారాజ సినిమా భారీ ప్రశంసలను అందుకోవడంతో పాటు అదే రేంజ్‍లో కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. హీరో విజయ్ సేతుపతి ఈ మూవీలో అద్భుతంగా నటించారు. మరోసారి నటనతో మెప్పించారు. ఈ మూవీకి సేతుపతి యాక్టింగ్ ప్రధానమైన బలంగా నిలిచింది. మహారాజ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో స్క్రీన్‍ప్లే విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. అయితే, మహారాజ చిత్రం కోంస ముందుగా విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ తీసుకోలేదని సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..

బడ్జెట్ పరిమితి వల్ల..

మహారాజ సినిమా కోసం రూ.20 కోట్ల బడ్జెట్ అని మేకర్స్ కచ్చితంగా పరిమితి పెట్టారని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, చిత్రీకరణ సాగే కొద్ది ఖర్చు ఎక్కువడటంతో బడ్జెట్ పరిమితి దాటకూడదనే ఉద్దేశంతో విజయ్ సేతుపతి ఈ మూవీ కోసం రెమ్యూనరేషన్‍ను వదులుకున్నారని తెలుస్తోంది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ఈ మహారాజ చిత్రంలో నటించారు. హీరోగా విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడం మరో ప్రత్యేకతగా ఉంది.

లాభాల్లో వాటా!

మహారాజ చిత్రం కోసం రెమ్యూనరేషన్ తీసుకోని విజయ్ సేతుపతి.. ఒకవేళ లాభాలు వస్తే అందులో వాటా ఇవ్వాలని నిర్మాతలకు చెప్పారట. ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అవటంతో లాభాలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ థింక్ బ్యానర్లపై సుధాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి నిర్మించారు.

మహారాజ కలెక్షన్లు

మహారాజ సినిమా సుమారు రూ.20కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. జూన్ 14వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది. మొదటి నుంచే పాజిటివ్ టాక్ రావటంతో భారీ వసూళ్లను రాబట్టింది. రెండు భాషల్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం మొత్తంగా సుమారు రూ.110 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. తెలుగు కోసం కూడా సేతుపతి బాగా ప్రమోషన్లు చేశారు. అది కూడా చిత్రానికి ప్లస్ అయింది. తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టుకుంది.

మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‍దాస్, నటరాజ్, అభిరామి అరుల్‍దాస్ కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథనం చాలా ఇంట్రెస్టింగ్‍గా ముందుకు నడిపారు. ట్విస్టులను రివీల్ చేసిన విధానం కూడా మెప్పించింది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేశారు స్వామినాథన్.

మహారాజ చిత్రానికి అజ్నీశ్ లోక్‍నాథ్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి బలంగా నిలిచింది. ఈ చిత్రానికి దినేశ్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ చేయగా.. ఫిలోమన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

మహారాజ ఓటీటీ

మహారాజ చిత్రానికి ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. జూలై 12 తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన దక్కింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Whats_app_banner