Maharaja OTT: మహారాజ సినిమా ఓటీటీ డేట్ అధికారికంగా ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లో రానుందంటే..
Maharaja OTT Release Date, Platform: మహారాజ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఐదు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది.
యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘మహారాజ’ సినిమా బ్లాక్‍బస్టర్ అయింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ అయింది. జూన్ 14న విడుదలైన ఈ సినిమాకు భారీగా వసూళ్లు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ మహారాజ చిత్రం మంచి కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుస్తున్నారు. ఇప్పుడు మహారాజ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.
స్ట్రీమింగ్ డేట్.. ఐదు భాషల్లో..
మహారాజ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూలై 12వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై నేడు (జూలై 8) ఆ ప్లాట్‍ఫామ్ అధికారిక ప్రకటన చేసింది. తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. మొత్తంగా ఐదు భాషల్లో జూలై 12న మహారాజ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
నెలలోపే..
మహారాజ చిత్రం జూలై 19వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని ముందుగా రూమర్లు వచ్చాయి. అయితే, అందుకు ఒక వారం ముందే జూలై 12వ తేదీన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ అయినా.. నెలలోపే ఓటీటీలో అడుగుపెడుతోంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది.
రూ.100 కోట్ల కలెక్షన్లు
మహారాజ చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. ఇప్పటి వరకు సుమారు రూ.104కోట్ గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం దక్కించుకుంది. సుమారు రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లతో బంపర్ హిట్ అయింది. ఇందులోనూ హీరోగా విజయ్ సేతుపతికి ఇది 50 చిత్రం కావడం మరో ప్రత్యేకతగా ఉంది. తెలుగులోనూ ఈ మూవీ కోసం విజయ్ ప్రమోషన్లను గట్టిగానే చేశారు. రిలీజ్‍కు ముందు.. ఆ తర్వాత కూడా ప్రెస్‍మీట్‍లు నిర్వహించారు. కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా కూడా ఆకట్టుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది.
మహారాజ సినిమాకు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ అంత కొత్తది కాకపోయినా స్క్రీన్‍ప్లేతో మ్యాజిక్ చేశారు. ఎంగేజింగ్‍గా, గ్రిప్పింగ్‍గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చి మెప్పించారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి, అరుల్‍దాస్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్‌కు కూడా చాలా ప్రసంశలు దక్కుతున్నాయి.
మహారాజ సినిమాను ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ థింక్ పతాకాలపై సుధాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి కలిసి నిర్మించారు. అజ్నీశ్ లోకనాథ్ సంగీతం మ్యూజిక్ ఇచ్చారు. ఈ కథను డైరెక్టర్ నితిలన్ స్వామినాథనే రాసుకున్నారు. లక్ష్మి ఎవరనే ఉత్కంఠను మహారాజ సినిమా ట్రైలర్ క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్రంపై బజ్ బాగా వచ్చింది. మూవీ కూడా థ్రిల్లింగ్‍గా ఉండటంతో మంచి కలెక్షన్లతో సూపర్ హిట్‍గా నిలిచింది.