Maharaja OTT: నెలలోపే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి ‘మహారాజ’ సినిమా! ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..
Maharaja OTT: మహారాజ సినిమా పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. అయితే, నెలలోగానే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది.
Maharaja OTT: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన మహారాజ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ శుక్రవారం (జూన్ 14) థియేటర్లలో రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్, కథనం ప్రేక్షకులను మెప్పిస్తోంది. మహారాజ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. అయితే, థియేటర్లలో రిలీజైన నెలలోగానే స్ట్రీమింగ్‍కు వచ్చేలా ఈ సినిమా ఓటీటీ డీల్ జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్‍ఫామ్ కూడా ఖరారైంది.
స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చు!
మహారాజ ఓటీటీ డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కుల డీల్ రిలీజ్‍కు ముందే జరిగింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా మూవీ టీమ్‍తో నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకుందని తెలుస్తోంది.
దీంతో నెలలోనే మహారాజ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. జూలై రెండో వారం లేకపోతే మూడో వారంలో ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ థియేట్రికల్ రన్ అప్పటికీ భారీగా ఉంటే మరో వారం ఆలస్యం కావొచ్చు.
మహారాజ సినిమాను ఆసక్తికర కథనంతో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు నిథిలన్. విజయ్ సేతుపతితో పాటు ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి, సింగంపులి, అరుల్‍దాస్, కీరోల్స్ చేశారు. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్‌కు కూడా చాలా ప్రసంశలు దక్కుతున్నాయి.
తెలుగులోనూ జోరుగా ప్రమోషన్లు
తమిళంలో రూపొందిన మహారాజ చిత్రం తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ కోసం కూడా మూవీ టీమ్ ప్రమోషన్లను బాగా చేసింది. ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍లోనూ విజయ్ సేతుపతి పాల్గొన్నారు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తెలుగు యంగ్ హీరో సుహాస్‍తో ఓ ఇంటర్వ్యూలో విజయ్ ముచ్చటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీకి తొలి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. హీరోగా విజయ్ సేతుపతికి ఇది 50వ చిత్రంగా ఉంది.
మహారాజ మూవీకి అజ్నీశ్ లోకనాథ్ సంగీతం అందించారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రంలో ఇంటెన్స్‌గా సాగింది. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై సుధాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు.
మహారాజ స్టోరీ లైన్
ఈ సినిమాలో మహారాజ అనే బార్బర్ పాత్ర పోషించారు విజయ్ సేతుపతి. మహారాజ (విజయ్ సేతుపతి) భార్య చనిపోగా.. అతడు తన కూతురు జ్యోతితో కలిసి జీవిస్తుంటాడు. ఓ రోజు హఠాత్తుగా మహారాజ పోలీస్ స్టేషన్‍కు వెళతాడు. తమపై ముగ్గురు దాడి చేశారని, తమ కూతురిని కాపాడిన లక్ష్మిని అపహరించుకు వెళ్లారని ఫిర్యాదు చేస్తాడు. లక్ష్మిని కాపాడాలని కంప్లైంట్ ఇస్తాడు. అయితే, లక్ష్మి పోలికలను మహారాజ సరిగా చెప్పడు. దీంతో పోలీసులు ముందుగా ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరిస్తారు. ఆ తర్వాత కేసు నమోదు చేస్తారు. అసలు మహారాజ, అతడి కూతురుపై దాడి చేసిందెవరు.. లక్ష్మి ఎవరు.. చివరికి లక్ష్మిని పట్టుకున్నారా.. అనేదే ఈ మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మహారాజ సినిమా కథనం బాగుందని, థ్రిల్లింగ్‍గా ఉందనే టాక్ పాజిటివ్ టాక్ వచ్చింది.
టాపిక్