Maharaja box office collection: బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న మహారాజా.. నాలుగు రోజుల కలెక్షన్లు ఇవీ
Maharaja box office collection: విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ మూవీ తొలి సోమవారం (జూన్ 17) పరీక్ష కూడా పాస్ కావడం విశేషం.
Maharaja box office collection: తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్లలో ఇరగదీస్తోంది. నాలుగో రోజైన సోమవారం (జూన్ 17) ఈ సినిమా ఇండియాలో రూ.6 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు Sacnilk.com వెల్లడించింది. దీంతో నాలుగు రోజుల్లో ఈ మూవీ కలెక్షన్లు రూ.30 కోట్లకు చేరువయ్యాయి.
మహారాజా బాక్సాఫీస్ కలెక్షన్లు
మహారాజా మూవీ తొలి రోజు కంటే నాలుగో రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఈ మూవీ తొలి రోజు రూ.4.7 కోట్లతో మొదలైంది. అందులో తమిళంలో రూ.3.6 కోట్లు, తెలుగులో రూ.1.1 కోట్లు వచ్చాయి. తొలి షో నుంచే ఈ మూవీకి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు తర్వాతి రెండు రోజులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. రెండో రోజు ఇవి రూ.7.75 కోట్లకు చేరాయి.
అందులో తమిళం వెర్షన్ కు రూ.5.85 కోట్లు, తెలుగులో రూ. 1.9 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజైన ఆదివారం ఈ వసూళ్లు మరింత భారీగా పెరిగాయి. ఆ రోజు మొత్తంగా రూ.9.4 కోట్లు వసూలు చేసింది. తమిళంలో రూ.7.25 కోట్లు, తెలుగులో రూ.2.15 కోట్లు వచ్చాయి. నాలుగో రోజైన సోమవారం కూడా బక్రీద్ కారణంగా సెలవు రోజు కావడంతో కలెక్షన్లు ఫర్వాలేదనిపించాయి.
తమిళం, తెలుగు వెర్షన్లు కలిపి నాలుగో రోజు రూ.5.5 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా తొలి నాలుగు రోజులు కలిపి మహారాజా మూవీ రూ.27.35 కోట్లు రాబట్టింది. తమిళంలో సోమవారం (జూన్ 17) 33.83 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ బార్బర్ గా నటించాడు. నిథిలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది.
ఈ సినిమాను తొలి రోజే చూసిన నటి కీర్తి సురేశ్ కూడా మహారాజపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మూవీని తమిళ సినిమా జెమ్ గా అభివర్ణించింది. నిథిలన్ డైరెక్షన్ అద్భుతంగా ఉందని, విజయ్ సేతుపతి ఇరగదీశాడని చెప్పింది.
మహారాజా ఓటీటీ
మహారాజ ఓటీటీ డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కుల డీల్ రిలీజ్‍కు ముందే జరిగింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా మూవీ టీమ్‍తో నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకుందని తెలుస్తోంది.
దీంతో నెలలోనే మహారాజ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. జూలై రెండో వారం లేకపోతే మూడో వారంలో ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ థియేట్రికల్ రన్ అప్పటికీ భారీగా ఉంటే మరో వారం ఆలస్యం కావొచ్చు.
మహారాజ సినిమాను ఆసక్తికర కథనంతో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు నిథిలన్. విజయ్ సేతుపతితో పాటు ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి, సింగంపులి, అరుల్‍దాస్, కీరోల్స్ చేశారు. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్‌కు కూడా చాలా ప్రసంశలు దక్కుతున్నాయి.
టాపిక్