Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం, ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం, ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం కన్నుమూశారు. ఆయన 1935 జనవరి 1న జన్మించారు. ఓం ప్రకాశ్ చౌతాలా మాజీ ఉపప్రధాని చౌదరి దేవీలాల్ ఐదుగురు సంతానంలో పెద్దవాడు.
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం కన్నుమూశారు. ఆయన హర్యానాకు ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల న్యుమోనియాతో బాధ పడుతున్న ఆయనను ఇటీవల చికిత్స నిమిత్తం మేదాంత ఆసుపత్రిలో చర్చారు. రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
స్వగ్రామంలో అంత్యక్రియలు
శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో మేదాంత ఆస్పత్రికి తరలించగా ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ఐఎన్ఎల్డీ, ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం తేజఖేడా గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. "ఓం ప్రకాశ్ చౌతాలా చాలా సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. దేవీలాల్ పనిని ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమించారు" అని ప్రధాని మోదీ (narendra modi) తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నేతల నివాళులు
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు వివిధ రాజకీయ పార్టీల నేతలు నివాళులు అర్పించారు. ఓం ప్రకాశ్ చౌతాలా సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. 'ఐఎన్ఎల్డీ అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. సీనియర్ నాయకుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి హర్యానా (haryana news) రాజకీయ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆయన చేసిన సేవలు, వారసత్వం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.