తెలుగు న్యూస్ / ఫోటో /
బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!
- బుధాదిత్య రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం దక్కనుంది. మకర రాశిలో ఈ యోగం ఏర్పడడంతో ప్రయోజనాలు దక్కనున్నాయి. వచ్చే నెలలో ఈ యోగం సంభవించనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- బుధాదిత్య రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం దక్కనుంది. మకర రాశిలో ఈ యోగం ఏర్పడడంతో ప్రయోజనాలు దక్కనున్నాయి. వచ్చే నెలలో ఈ యోగం సంభవించనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
సూర్యుడు, బుధుడు కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. మకర రాశిలో వచ్చే నెల (2025 జనవరి) ఈ యోగం సంభవించనుంది. ఈ రెండు గ్రహాల కలయిక ఉండనుంది.
(2 / 5)
వచ్చే నెల 2025 జనవరి 14వ తేదీన మకర రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టనునన్నాడు. జనవరి 24న అదే రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. ఈ రెండింటి కలయికతో జనవరి 24న బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఉండనుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి రానుంది.
(3 / 5)
ధనస్సు: మకరంలో బుధాదిత్య రాజయోగ కాలం ధనస్సు రాశి వారి లక్‍ను సానుకూలంగా మార్చేస్తుంది. వీరికి అన్ని విధాలుగా లాభించనుంది. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చేసే పనుల్లో ఎక్కువ విజయాలే ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది.
(4 / 5)
మకరం: ఈ రాశిలోనే బుదాధిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ కాలంలో మకర రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
(5 / 5)
తుల: బుధాదిత్య రాజయోగ కాలం తులా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారపరంగా చాలా అంశాలు కలిసి వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు దకొచ్చు. పెట్టుబడులపై మంచి రాబడులు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సత్ఫలితాలు ఉంటాయి. ఆనందం అధికం అవుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు