Vijay Sethupathi Maharaja: చైనాలో దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి మహారాజా.. ప్రభాస్ బాహుబలి 2 రికార్డు బ్రేక్
Vijay Sethupathi Maharaja: విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ చైనాలో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ప్రభాస్ నటించిన బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసి చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగా నిలవడం విశేషం.
Vijay Sethupathi Maharaja: మహారాజా మూవీ ఇండియాలో థియేటర్లలో, తర్వాత ఓటీటీలోనే కాదు.. ఇప్పుడు చైనాలోనూ దూసుకెళ్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చైనా బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లో పదో స్థానంలో నిలిచింది. అయితే ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2 మూవీ రికార్డును ఈ క్రమంలో బ్రేక్ చేయడం విశేషం. ఈ సినిమాలో విజయ్ సేతుపతితోపాటు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నటించాడు.
మహారాజా బాక్సాఫీస్ రికార్డు
ఈ ఏడాది తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో మహారాజా కూడా ఒకటి. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమాగా తెరకెక్కగా.. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైనే వసూలు చేసింది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ పలు రికార్డులను తిరగరాసింది.
ఇక ఇప్పుడు చైనాలోనూ తన డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk ప్రకారం.. చైనాలో మహారాజా 21 రోజుల్లో రూ.85.75 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2 (రూ.80.50 కోట్లు) రికార్డును తిరగరాసింది. ఇక ఇప్పుడు రూ.100 కోట్ల వైపు దూసుకెళ్తోంది.
టాప్‌లోనే ఆమిర్ ఖాన్ దంగల్
చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ ఇప్పటికీ టాప్ లో కొనసాగుతోంది. ఈ మూవీ ఇండియాలో కంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు చైనాలో సాధించడం విశేషం. 2016లో రిలీజైన దంగల్.. ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగాట్, గీతా ఫోగాట్ ల జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా సుమారు రూ.1750 కోట్లు వసూలు చేయడం విశేషం.
దంగల్ తర్వాత చైనాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో వరుసగా సీక్రెట్ సూపర్ స్టార్, అంధాధున్, బజరంగీ భాయ్‌జాన్, హిందీ మీడియం, హిచ్‌కీ, పీకే, మామ్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథాలాంటి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం పదో స్థానంలో ఉన్న మహారాజా త్వరలోనే చైనాలో రూ.100 కోట్ల మార్క్ తో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లో 9వ స్థానానికి చేరనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మహారాజా వసూళ్లు రూ.200 కోట్లకు చేరవవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ మూవీ రూ.193 కోట్లు వసూలు చేసింది.
మహారాజా మూవీ గురించి..
మహారాజా మూవీకి నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. ఇందులో విజయ్ సేతుపతితోపాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామిలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీలో ఓ సాధారణ బార్బర్ పాత్రలో విజయ్ నటించాడు. తన ఇంట్లో తాను లక్ష్మి అని పిలుచుకునే చెత్త డబ్బా కనిపించకుండా పోయిందంటూ పోలీస్ స్టేషన్ లో అతడు ఫిర్యాదు చేస్తాడు.
అసలు దాని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటన్నది మూవీ చూస్తే తెలుస్తుంది. ఇందులోని ట్విస్టులు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. అందుకే ఈ మూవీ ఇండియాతోపాటు చైనాలోనూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.
టాపిక్