Aamir Khan: మూడో పెళ్లి చేసుకుంటారా?: ఆమిర్ ఖాన్ ఏం చెప్పారంటే..-i am 59 it is difficult aamir khan response on third marriage question ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aamir Khan: మూడో పెళ్లి చేసుకుంటారా?: ఆమిర్ ఖాన్ ఏం చెప్పారంటే..

Aamir Khan: మూడో పెళ్లి చేసుకుంటారా?: ఆమిర్ ఖాన్ ఏం చెప్పారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 26, 2024 03:39 PM IST

Aamir Khan: మూడో పెళ్లి చేసుకుంటారా అంటూ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‍కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. తన వయసును గుర్తు చేస్తూ సమాధానం ఇచ్చారు. అలాగే లాల్ సింగ్ చడ్డా మూవీ ఫెయిల్ అయ్యేందుకు తానే కారణమని ఆమిర్ చెప్పారు.

Aamir Khan: మూడో పెళ్లి చేసుకుంటారా?: ఆమిర్ ఖాన్ ఏం చెప్పారంటే..
Aamir Khan: మూడో పెళ్లి చేసుకుంటారా?: ఆమిర్ ఖాన్ ఏం చెప్పారంటే..

బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పటికే ఇద్దరు భార్యలతో విడిపోయారు. 2002లో రీనా దత్తాకు విడాకులు ఇచ్చిన ఆమిర్.. ఆ తర్వాత కిరణ్ రావ్‍ను వివాహం చేసుకున్నారు. 2021లో ఆమిర్, కిరణ్ విడిపోయారు. అయితే, మూడో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అని ఆమిర్ ఖాన్‍కు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు.

ఇప్పుడు కష్టమే

తనకు ప్రస్తుతం 59 సంవత్సరాలు ఉన్నాయని, మూడో పెళ్లి చేసుకోవడం కష్టమేనని ఆమిర్ ఖాన్ చెప్పారు. రియా చక్రవర్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆమిర్ మాట్లాడారు. మూడో పెళ్లి చేసుకునే అవకాశం ఉందా అని రియా అడుగగా.. ఆమిర్ రియాక్ట్ అయ్యారు.

తనకు ఇప్పటికే జీవితంలో చాలా బంధాలు ఉన్నాయని ఆమిర్ ఖాన్ చెప్పారు. “నాకు ఇప్పుడు 59 ఏళ్లు. ఇప్పుడు మళ్లీ ఎక్కడ పెళ్లి చేసుంటా. అది చాలా కష్టంగా అనిపిస్తోంది. నా జీవితంలో ఇప్పుడు చాలా రిలేషన్లు ఉన్నాయి. నా కుటుంబం, నా పిల్లలతో నేను మళ్లీ కనెక్ట్ అయ్యాయి. నాకు క్లోజ్‍గా ఉండే వారితో కలిసి ఉండేందుకు ఇష్టపడతా. నేను మరింత ఉత్తమమైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా” అని ఆమిర్ ఖాన్ చెప్పారు.

అది చెప్పేందుకు నేను కరెక్ట్ కాదు

పెళ్లి చేసుకునే వారికి ఏదైనా సలహా ఇస్తారా అని ఆమిర్ ఖాన్‍ను రియా చక్రవర్తి ప్రశ్నించారు. అయితే, తనకు రెండు పెళ్లిళ్లు విఫలమయ్యాయని, ఈ విషయంలో సలహాలు చెప్పేందుకు తాను సరైన వ్యక్తి కాదని చెప్పారు ఆమిర్. తాను ఒంటరిగా ఉండలేనని, భాగస్వామి ఉండాలనే అనుకుంటానని ఆయన అంగీకరించారు. తన మాజీ భార్యలు కిరణ్ రావ్, రీనా దత్తాతో ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పెళ్లి విజయవంతం కావడం అనేది ఆయా వ్యక్తులను బట్టి మారుతుంటోందని, విభిన్నంగా ఉంటుందని ఆమిర్ అన్నారు.

నా వల్లే ఆ సినిమా ఫెయిల్ అయింది

లాల్ సింగ్ చడ్డా సినిమా తన పర్ఫార్మెన్స్ బాగోలేకపోవడం వల్లే ప్లాఫ్ అయిందని ఆమిర్ ఖాన్ స్వయంగా అంగీకరించారు. ఆ చిత్రం వల్ల తాను చాలా నేర్చుకునేందుకు అవకాశం కలిగిందని అన్నారు. “లాల్ సింగ్ చడ్డా సినిమాలో నేను కాస్త ఎక్కువ పిచ్‍తో పర్ఫార్మెన్స్ చేశా. ఒరిజినల్ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రంలో టామ్ హాంక్ అద్భుతంగా నటించారు. అందుకే అందరూ లీనమయ్యారు. నా పర్ఫార్మెన్స్ వల్లే లాల్ సింగ్ చడ్డా సరిగా రాలేదు. ఆ చిత్రంలో నా పర్ఫార్మెన్స్ సరిగా లేదు. నాకు అది అర్థమైంది. అయితే నేర్చుకునేందుకు నాకు చాలా దొరికింది. తర్వాతి సినిమా నా పర్ఫార్మెన్స్ బాగుటుందని నేను అనుకుంటున్నా” అని ఆమిర్ ఖాన్ చెప్పారు.

తన నటనే వల్లే లాల్ సింగ్ చడ్డా ఫెయిల్ అందని ధైర్యంగా ఆమిర్ ఖాన్ అంగీకరించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరే ఇతర నటుడు కూడా ఇలా చెప్పలేరని, ఆమిర్ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆమిర్ ఖాన్ ప్రస్తుతం సితారే జమీన్‍పర్ చిత్రం చేస్తున్నారు. స్పానిష్ చిత్రం చాంపియన్ స్ఫూర్తితో ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో సితారే జమీన్ పర్ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.