Aamir Khan: ఆ సినిమా ఫెయిల్ అవడంతో ఆమిర్ ఖాన్ చాలా బాధపడ్డారు: ఆమిర్ మాజీ భార్య కిరణ్ రావ్-bollywood news aamir khan deeply affected by laal singh chaddha failure kiran rao ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aamir Khan: ఆ సినిమా ఫెయిల్ అవడంతో ఆమిర్ ఖాన్ చాలా బాధపడ్డారు: ఆమిర్ మాజీ భార్య కిరణ్ రావ్

Aamir Khan: ఆ సినిమా ఫెయిల్ అవడంతో ఆమిర్ ఖాన్ చాలా బాధపడ్డారు: ఆమిర్ మాజీ భార్య కిరణ్ రావ్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 11, 2024 03:03 PM IST

Kiran Rao on Aamir Khan: లాల్ సింగ్ చడ్డా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలువడంతో ఆమిర్ ఖాన్ బాధపడ్డారని ఆయన మాజీ భార్య కిరణ్ రావు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి మాట్లాడారు.

ఆమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్

Aamir Khan: ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా భారీ అంచనాలతో 2022లో రిలీజ్ అయింది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తర్వాత నాలుగేళ్ల అనంతరం ఈ చిత్రం రావడంతో ఆమిర్‌కు చాలా కీలకంగా నిలిచింది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం లాల్ సింగ్ చడ్డా నిరాశపరిచింది. హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ కథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అద్వైత్ చందన్. అయితే, చివరికి డిజాస్టర్‌గా నిలిచింది లాల్ సింగ్ చడ్డా. ఈ విషయంలో ఆమిర్ ఎలా రియాక్ట్ అయ్యారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆయన మాజీ భార్య కిరణ్ రావ్.

లాల్ సింగ్ చడ్డా సినిమా ఫెయిల్ అవడంతో ఆమిర్ ఖాన్‍ బాధపడ్డారని కిరణ్ రావ్ చెప్పారు. ఆ మూవీ వైఫల్యంతో ఆయనను బాగా ఎఫెక్ట్ అయ్యారని తాజాగా జూమ్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జనాలకు ఆ చిత్రం కనెక్ట్ కాలేదని అంగీకరించారు.

“అన్ని విధాల కష్టపడినా అది సక్సెస్ కాకపోవడం చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది. లాల్ సింగ్ చడ్డా విషయంలో అదే జరిగింది. ఈ మూవీ ఆమిర్‌ను బాగా ఎఫెక్ట్ చేసింది. అలాగే టీమ్ మొత్తంగా అలాగే ఫీల్ అయ్యారు” అని కిరణ్ రావ్ చెప్పారు. ఈ చిత్రానికి ఆమె సహ నిర్మాతగానూ వ్యవహరించారు.

ఆమిర్ ఖాన్‍కు లాల్ సింగ్ చడ్డా మూవీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, కానీ ఆ చిత్రం జనాలకు మాత్రం చేరలేకపోయిందని కిరణ్ రావ్ అన్నారు. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన వచ్చినా.. మొత్తంగా భారీస్థాయిలో ప్రజలకు చేరుకోలేదని చెప్పారు.

టామ్ హాంక్స్ ప్రధాన పాత్ర పోషించిన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్‍కు రీమేక్‍గా ‘లాల్ సింగ్ చడ్డా’ వచ్చింది. అయితే, ఇండియాకు తగ్గట్టుగా చాలా మార్పులను చేశారు. ఈ చిత్రానికి అతుల్ కులకర్ణి రచయితగా ఉండగా.. దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కించారు.

లాల్ సింగ్ చడ్డా గురించి..

లాల్ సింగ్ చడ్డా మూవీలో ఆమిర్ ఖాన్ నటనకు ప్రశంసలు వచ్చాయి. ఎమోషనల్ సీన్లు కూడా ఆకట్టుకున్నాయి. అయితే, కథనం సరిగా లేకపోవటంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కేవలం రూ.120 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను ఎదుర్కొంది. ఈ చిత్రం టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలకపాత్ర పోషించారు. దీంతో తెలుగులోనూ ఈ చిత్రం కోసం ప్రమోషన్లను జోరుగా చేసినా ఫలితం లేకపోయింది.

లాల్ సింగ్ చడ్డా చిత్రంలో ఆమిర్ ఖాన్‍కు జోడీగా నటించారు కరీనా కపూర్. నాగచైతన్య, మోనా సింగ్, రోహన్ సింగ్, మానవ్ విజ్, ఆర్య శర్మ, అరుణ్ బాలీ, జగత్ రావత్ కీరోల్స్ చేశారు. తనూజ్ టింకూ, ప్రీతమ్ సంగీతం అందించారు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతీ దేశ్‍పాండే, అజిత్ అంధారే సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

కాగా, 2021లో అమిర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకులు తీసుకున్నారు. తమ 15ఏళ్ల వివాహ బంధానికి ఫుల్‍స్టాప్ పెట్టారు.

కిరణ్ రావ్ దర్శకత్వంలో..

కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ అనే చిత్రం మార్చి 1వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషనల్లో ఆమె బిజీగా ఉన్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే లాల్ సింగ్ చడ్డా గురించి మాట్లాడారు. లాపతా లేడీస్ చిత్రం నిర్మాతల్లో ఆమిర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో అతిశయ్ జైన్ అఖిల్, శివం ఘవారియా, నితాన్షి గోయల్ ప్రధాన పాత్రలు పోషించారు.

IPL_Entry_Point