Laal Singh Chaddha: అమరవీరులకు నివాళులు అర్పించిన ఆమిర్‌ ఖాన్‌, నాగ చైతన్య-aamir khan and naga chaitanya paid tributes to martyrs ahead of laal singh chaddha release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Laal Singh Chaddha: అమరవీరులకు నివాళులు అర్పించిన ఆమిర్‌ ఖాన్‌, నాగ చైతన్య

Laal Singh Chaddha: అమరవీరులకు నివాళులు అర్పించిన ఆమిర్‌ ఖాన్‌, నాగ చైతన్య

HT Telugu Desk HT Telugu

Laal Singh Chaddha: తన నెక్ట్స్‌ మూవీ లాల్‌ సింగ్‌ చడ్డా రిలీజ్‌కు ముందు జాతీయ యుద్ధ స్మారకం దగ్గర అమరవీరులకు నివాళులర్పించాడు ఆమిర్ ఖాన్‌. అతనితోపాటు నాగ చైతన్య కూడా ఉన్నాడు.

అమరవీరులకు నివాళులర్పిస్తున్న ఆమిర్ ఖాన్, నాగచైతన్య

ఆమిర్‌ఖాన్‌ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ లాల్‌ సింగ్‌ చడ్డా. ఈ నెల 11 (గురువారం)న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమిర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌కు ఇది రీమేక్‌. ఈ లాల్‌ సింగ్ చడ్డాలో టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ మంగళవారం (ఆగస్ట్‌ 9) ఢిల్లీలోని యుద్ధ స్మారకం దగ్గరకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు. స్మారకం దగ్గర ఆమిర్‌ ఖాన్‌, నాగ చైతన్య పుష్పగుచ్చాలు ఉంచి నమస్కరించారు. మరో ఫొటోలో వీళ్లు అక్కడి జవాన్లతో మాట్లాడుతూ కనిపించారు. ఆమిర్‌ ఖాన్‌ తెల్లని కుర్తా, బ్లూ జీన్స్‌లో కనిపించగా.. నాగచైతన్య టీషర్ట్‌తో క్యాజువల్‌ లుక్‌లో కనిపించాడు.

లాల్‌ సింగ్‌ చడ్డా హిందీతోపాటు తెలుగులోనూ రిలీజ్‌ అవుతోంది. అద్వైత్‌ చందన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌, మోనా సింగ్‌ కూడా నటించారు. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఇదే సినిమాలో షారుక్‌ ఖాన్‌ అతిథిపాత్రలో కనిపించనున్నట్లు కూడా ఇప్పటికే ఆమిర్‌ ఖాన్‌ స్పష్టం చేశాడు.

ఓ దివ్యాంగుని పాత్రలో ఆమిర్‌ కనిపించనున్నాడు. అలాంటి వ్యక్తి ఆ తర్వాత రన్నింగ్‌లో సత్తా చాటడంతోపాటు ఆర్మీలోనూ ఎలా చేరాడన్నదే కథ. 1994లో హాలీవుడ్‌లో వచ్చిన ఫారెస్ట్‌ గంప్‌ మూవీలో టామ్‌ హ్యాంక్స్‌ నటించాడు. ఆ మూవీ ఆరు అకాడెమీ అవార్డులు గెలుచుకోవడం విశేషం.