Thank You OTT Release Date: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగచైతన్య థాంక్యూ.. ఎందులోనో తెలుసా?-thank you movie ott release date announced by the digital platform prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thank You Ott Release Date: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగచైతన్య థాంక్యూ.. ఎందులోనో తెలుసా?

Thank You OTT Release Date: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగచైతన్య థాంక్యూ.. ఎందులోనో తెలుసా?

HT Telugu Desk HT Telugu

నాగ చైతన్య నటించిన థాంక్యూ మూవీ అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది. గత నెల 22న రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా బోల్తా కొట్టడంతో మూడు వారాల్లోనే ఓటీటీ ప్రీమియర్స్‌కు సిద్ధమైంది.

థ్యాంక్యూ మూవీలో నాగ చైతన్య (Twitter)

ఎన్నో ఆశలు, అంచనాల మధ్య నాగచైతన్య థాంక్యూ మూవీ రిలీజైన విషయం తెలుసు కదా. మనంలాంటి హిట్‌ ఇచ్చిన విక్రమ్‌ కే కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న మూవీ కావడంతో చైతూ ఫ్యాన్స్‌ ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూశారు. కానీ సినిమాకు నెగటివ్‌ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది.

దీంతో ఈ థాంక్యూ ఊహించిన దాని కంటే చాలా ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 11న (గురువారం) అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోకి ఈ సినిమా రానుంది. అంటే థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోపే ఓటీటీలోకి రానుండటం విశేషం. ప్రైమ్‌ వీడియోనే ఈ విషయాన్ని మంగళవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ప్రత్యేకమైన స్టోరీలైన్‌తో మిమ్మల్ని సంతోషాల సముద్రంలో ముంచెత్తడానికి వాళ్లు వచ్చేస్తున్నారు అంటూ ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌ను ప్రైమ్‌ వీడియో అనౌన్స్‌ చేసింది.

నిజానికి ఈ నెల 11నే నాగ చైతన్య ముఖ్యమైన పాత్రలో నటించిన లాల్‌ సింగ్ చడ్డా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. అయితే డిజాస్టర్‌గా మిగిలిపోయినా ఈ థాంక్యూ మాత్రం తనకు ప్రత్యేకమైనదని నాగచైతన్య అన్నాడు. తన మనసుకు చాలా దగ్గరైన సినిమా అని అతడు చెప్పాడు. జీవితంలో మనం ఎదగడానికి సాయపడిన వాళ్లను గుర్తుంచుకొని, వాళ్లకు కృతజ్ఞత చూపాల్సిన అవసరాన్ని ఈ సినిమా చూపించింది.

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్‌ చడ్డాలో చైతూ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇది బాలీవుడ్‌లో చైతూకి తొలి మూవీ. దీంతోపాటు దూత అనే హారర్‌ వెబ్‌ సిరీస్‌తో అటు ఓటీటీలోకీ నాగచైతన్య ఎంట్రీ ఇస్తున్నాడు. మరోవైపు రష్మికా మందన్నాతో కలిసి మరో సినిమా కూడా చేయబోతున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.