Aamir Khan: రాజమౌళితో పని చేయాలని ఉంది: ఆమిర్‌ ఖాన్‌-aamir khan once again showed his interest to work the ss rajamouli
Telugu News  /  Entertainment  /  Aamir Khan Once Again Showed His Interest To Work The Ss Rajamouli
కాఫీ విత్ కరణ్ షోలో కరీనా కపూర్, ఆమిర్ ఖాన్
కాఫీ విత్ కరణ్ షోలో కరీనా కపూర్, ఆమిర్ ఖాన్

Aamir Khan: రాజమౌళితో పని చేయాలని ఉంది: ఆమిర్‌ ఖాన్‌

05 August 2022, 10:54 ISTHT Telugu Desk
05 August 2022, 10:54 IST

Aamir Khan: బాలీవుడ్‌ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ మరోసారి దర్శక ధీరుడు రాజమౌళిపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. గురువారం (ఆగస్ట్‌ 4) టెలికాస్ట్‌ అయిన కాఫీ విత్‌ కరణ్‌ షోకి వచ్చిన అతడు.. రాజమౌళితో సినిమాపై ఆసక్తి చూపించాడు.

ఒకరేమో కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్‌లో మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌గా ఎన్నో హిట్‌ సినిమాలు అందించిన హీరో.. మరొకరు బాహుబలితో పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయిన వ్యక్తి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఏ సినిమా అభిమానికి మాత్రం ఆసక్తి ఉండదు చెప్పండి. అలాంటి కాంబినేషనే వస్తే ఇండియన్‌ సినిమా హిస్టరీలో నిలిచిపోయే మూవీ పక్కాగా ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు.

ప్రస్తుతానికి అలాంటిదేమీ లేకపోయినా.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయడంపై మరోసారి ఆసక్తి చూపించాడు ఆమిర్‌ ఖాన్‌. తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో కరీనాకపూర్‌తో కలిసి వచ్చాడతడు. తన లేటెస్ట్‌ మూవీ లాల్‌ సింగ్‌ చడ్డా ప్రమోషన్లలో ఆమిర్‌ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాస్తుందన్న ఆశతో ఆమిర్‌ ఉన్నాడు.

చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తున్న అతడు.. లాల్‌ సింగ్‌ చడ్డాతో రికార్డులు తిరగరాయడమే కాదు.. తన తర్వాతి సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నాడు. ముఖ్యంగా డైరెక్టర్ల ఎంపిక విషయంలో ఆమిర్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాల్లో తాను కలిసి పని చేయాలనుకుంటున్న డైరెక్టర్ల గురించి కాఫీ విత్‌ కరణ్‌ షోలో ఆమిర్‌ చెప్పుకొచ్చాడు.

ఊహించినట్లే ఈ లిస్ట్‌లో రాజమౌళియే టాప్‌లో ఉన్నాడు. చాలా మంది డైరెక్టర్లతో కలిసి పని చేయాలని ఉన్నా.. ఇందులో రాజమౌళి పేరే ముందుంటుందని అతను అన్నాడు. ఈ మధ్య మీడియాతో మాట్లాడిన సందర్భాల్లోనూ బాహుబలి మేకర్‌తో పని చేయాలని అనుకుంటున్నట్లు ఆమిర్‌ చెప్పాడు. ఒకవేళ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే మాత్రం అది సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుందనడంలో సందేహం లేదు.

అయితే దానికి చాలా సమయం పట్టడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుతో రాజమౌళి సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు. దీనికి కనీసం మూడేళ్లు పడుతుంది. ఆలోపు ఆమిర్‌తో సినిమా ప్లాన్‌ చేసినా అది సెట్స్‌లోకి వచ్చి ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం.