Naga Chaitanya: నాగ చైతన్య కొత్త సినిమా షురూ.. మరోసారి ఆ హీరోయిన్‌తో
నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా మరోసారి కనిపించనున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం థ్యాంక్యూ అనే సినిమాను చేస్తున్న అక్కినేని నట వారసుడు.. ప్రస్తుతం మరో సినిమాను సెట్‌పైకి తీసుకొచ్చాడు. బంగార్రాజు సినిమాలో చైతో నటించిన కృతిశెట్టినే ఇందులోనూ హీరోయిన్గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తమిళంలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
గురువారం ఉదయం పూజా కార్యక్రమంలో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. లింగుస్వామి, బోయపాటి శ్రీను, రానా, శివ కార్తికేయన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
హీరో రానా కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. బోయపాటి శ్రీను నటీనటులపై క్లాప్ కొట్టారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి ఇళయారాజా, యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారు.
బంగార్రాజు సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య-కృతిశెట్టి మరోసారి ఈ చిత్రం ద్వారా సందడి చేయనున్నారు. చేసిన తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో విశేష స్పందన లభించింది. దీంతో మరోసారి తెరపై కనిపించాలను కోరుకుంటున్నారు. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్