Laal Singh Chaddha: ఆమిర్‌ఖాన్‌ నాటకాలు ఆడుతున్నాడు: కంగనా రనౌత్‌-aamir khans mastermind behind negativity around laal singh chaddha says kangana ranaut ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Aamir Khans Mastermind Behind Negativity Around Laal Singh Chaddha Says Kangana Ranaut

Laal Singh Chaddha: ఆమిర్‌ఖాన్‌ నాటకాలు ఆడుతున్నాడు: కంగనా రనౌత్‌

లాల్ సింగ్ చడ్డా మూవీ ప్రమోషన్లలో ఆమిర్ ఖాన్
లాల్ సింగ్ చడ్డా మూవీ ప్రమోషన్లలో ఆమిర్ ఖాన్ (PTI)

Laal Singh Chaddha: బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌పై మండిపడింది నటి కంగనా రనౌత్‌. అతని సినిమా లాల్‌ సింగ్ చడ్డాపై ఇప్పుడు జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వెనుక అతని మాస్టర్‌మైండే ఉన్నదని అనడం విశేషం.

లాల్‌ సింగ్‌ చడ్డా.. నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌గా పేరుగాంచిన ఆమిర్‌ ఖాన్‌ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌కు ఇది రీమేక్‌. ఎప్పుడో 28 ఏళ్ల కిందట వచ్చిన ఆ సినిమాను అకాడెమీ అవార్డులు వరించాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ వస్తున్న సమయంలో లాల్‌ సింగ్‌ చడ్డాపై సోషల్‌ మీడియాలో నెగటివ్‌ ప్రచారం మొదలైంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుండగా.. ఓవైపు మేకర్స్‌ ప్రమోషన్లలో బిజీగా ఉంటే.. మరోవైపు బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా ట్విటర్‌లో కొన్ని రోజులుగా ట్రెండ్‌ అవుతోంది. అయితే ఇదంతా ఆమిర్‌ఖానే ఆడుతున్న డ్రామా అని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ విమర్శించడం విశేషం. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆమె ఆమిర్‌పై విమర్శలు గుప్పించింది.

"లాల్‌ సింగ్‌ చడ్డాపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వెనుక ఆమిర్‌ ఖాన్‌ జీ మాస్టర్‌ మైండ్‌ ఉంది. ఈ ఏడాది ఏ హిందీ సినిమా బాగా ఆడలేదు. సౌత్‌ సినిమాలే ఇండియా కల్చర్‌ను లేదా స్థానికతకు అద్దం పట్టి సక్సెస్‌ సాధించాయి. హాలీవుడ్‌ రీమేక్‌ ఎలాగూ పని చేయదని తెలుసు. కానీ ఇప్పుడు వాళ్లు ఇండియాలో అసహనం ఎక్కువైందని అంటారు. హిందీ సినిమాలు ప్రేక్షకుల నాడి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ, ముస్లిం సమస్య కాదు. ఆమిర్‌ఖాన్‌ జీ హిందూఫోబిక్‌ పీకే తీసినా, ఇండియాలో అసహనం ఎక్కువైందని అన్నా కూడా అతని సినిమాలు ఎంతో హిట్టయ్యాయి. దీనిని మతం లేదా సిద్ధాంతపరమైన అంశంగా చిత్రీకరించే పని మానుకోండి" అని కంగనా తన ఇన్‌స్టా స్టోరీలో రాసింది.

అటు ఆమిర్‌ఖాన్‌ కూడా ఈ బాయ్‌కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డాపై స్పందించాడు. తాను ఇండియాను వ్యతిరేకిస్తారని చాలా మంది అనుకుంటారని, కానీ ఇది నిజం కాదని, దయచేసి తన సినిమాను బాయ్‌కాట్‌ చేయొద్దని పిలుపునిచ్చాడు. మరోవైపు రెండు రోజలుగా ఈ మూవీకి మద్దతుగా ఇండియా లవ్స్‌ లాల్‌ సింగ్‌ చడ్డా, ఇండియా విత్‌ లాల్‌ సింగ్‌ చడ్డా హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.