Aamir Khan Kiran Rao: మాజీ భార్య కోసం ప్రొడ్యూసర్‌గా మారిన ఆమిర్‌ఖాన్ - డిఫరెంట్ టైటిల్ ఫిక్స్
Aamir Khan Kiran Rao: మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహిస్తోన్న బాలీవుడ్ మూవీ లాపటా లేడీస్‌కు ఆమిర్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ట్విట్టర్ ద్వారా ఆమిర్‌ఖాన్ వెల్లడించాడు.
Aamir Khan Kiran Rao: మాజీ భార్య కిరణ్‌రావ్ డైరెక్షన్‌లో రూపొందిన బాలీవుడ్ మూవీకి ఆమిర్‌ఖాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ సోషల్ మీడియా ద్వారా ఆమిర్‌ఖాన్ అనౌన్స్‌చేశాడు. 2002లో తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చిన ఆమిర్‌ఖాన్....2005లో కిరణ్ రావ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు.
లగాన్ సెట్స్‌లో కిరణ్‌రావ్‌తో మొదలైన పరిచయం ప్రేమగా మారడంతో ఈ జంట పెళ్లిపీటలెక్కారు. మనస్పర్థలతో తమ 15 ఏళ్ల వివాహ బంధానికి 2021లో ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావ్ ముగింపు పలికారు. తనయుడు ఆజాద్‌ఖాన్ బాధ్యతల్ని సమిష్టిగా తీసుకుంటున్నారు.
12 ఏళ్ల తర్వాత...
ఆమిర్‌ఖాన్ గత సినిమా లాల్‌సింగ్‌చడ్ఢాకు కిరణ్ రావ్ ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. దాదాపు పన్నెండేళ్ల విరామం తర్వాత మెగాఫోన్ పట్టిన కిరణ్ రావ్ తాజాగా లాపటా లేడీస్ పేరుతో ఓ మూవీని తెరకెక్కిస్తోంది. కొత్త నటీనటులతో కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఆమిర్‌ఖాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోండటం గమనార్హం.
విడాకులు తీసుకున్న తర్వాత కూడా కిరణ్ రావ్ సినిమాను ఆమిర్ ఖాన్ నిర్మించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. లాపటా లేడీస్ సినిమాలో నితాన్షీ గోయల్, ప్రతిభా రత్న, రవికిషన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను గురువారం అనౌన్స్‌చేశాడు ఆమిర్‌ఖాన్. జనవరి 5న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఆమిర్‌ఖాన్ వెల్లడించాడు.
2001 బ్యాక్‌డ్రాప్‌లో...
2001 టైమ్ పీరియడ్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లాపటా లేడీస్ మూవీ సాగనున్నట్లు సమాచారం. ట్రైన్‌లో కొత్త పెళ్లికూతురు ఎలా మిస్సయింది? ఆ తర్వాత ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కామెడీ డ్రామాగా కిరణ్ రావ్ ఈ మూవీని తెరకెక్కిస్తోంది.
టాపిక్