Aamir Khan: ఆ సీన్‍ను పూర్తి నగ్నంగా చేశా: ఆమిర్ ఖాన్-aamir khan says he completely naked while shooting for pk radio scene kapil sharma show on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aamir Khan: ఆ సీన్‍ను పూర్తి నగ్నంగా చేశా: ఆమిర్ ఖాన్

Aamir Khan: ఆ సీన్‍ను పూర్తి నగ్నంగా చేశా: ఆమిర్ ఖాన్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 28, 2024 08:08 PM IST

Aamir Khan - Kapil Sharma Show: ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చాలా విషయాలపై మాట్లాడారు. తన కెరీర్‌తో పాటు మరిన్ని విషయాలను పంచుకున్నాయి. అయితే, ఓ సీన్‍ను తాను పూర్తి నగ్నంగా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ వివరాలివే..

Aamir Khan: ఆ సీన్‍ను పూర్తి నగ్నంగా చేశా: ఆమిర్ ఖాన్
Aamir Khan: ఆ సీన్‍ను పూర్తి నగ్నంగా చేశా: ఆమిర్ ఖాన్

Aamir Khan: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్.. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. సినిమాల కోసం ఎంత కష్టపడేందుకైనా ఆయన సిద్ధపడతారు. అందుకే ఆమిర్‌ను అందరూ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అంటారు. తాను చేస్తున్న పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ఆయన ఎంతైనా కృషి చేస్తారు. ఆమిర్ కెరీర్లో పీకే చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ఆ మూవీలో విభిన్నమైన నటనతో ఆయన అందరినీ మెప్పించారు. అయితే, ఆ సినిమాలో ఓ సీన్‍ను తాను పూర్తి నగ్నంగా చేయాల్సి వచ్చిందని ఆమిర్ వెల్లడించారు. ఆ వివరాలివే..

yearly horoscope entry point

కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆమిర్ ఖాన్ వచ్చారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ టాక్‍ షోలో తన కెరీర్లో ఎదురైన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఆమిర్ పంచుకున్నారు. ఈ సందర్భంగానే పీకే మూవీలో తన ఇంట్రడక్షన్ సీన్ షూటింగ్ గురించి వివరించారు. ఆ సీన్‍ను పూర్తి నగ్నంగా చేయాల్సి వచ్చిందని ఆమిర్ చెప్పారు.

నగ్నంగా చేయాల్సి వచ్చింది

సెట్‍లో చాలా కొంత మంది సిబ్బందితో ఆ షాట్ చేద్దామని దర్శకుడు రాజ్‍కుమార్ హిరానీ తనకు చెప్పారని ఆమిర్ ఖాన్ తెలిపారు. గార్డ్‌లా చిన్నగా ఉండే షార్ట్ ధరించాలని చెప్పారని అన్నారు. అయితే, ఆ షార్ట్ ధరిస్తే పరిగెత్తేందుకు చాలా ఇబ్బందిగా అనిపించిందని, అందుకు షాట్ బాగా వచ్చేందుకు పూర్తి నగ్నంగా నటించేందుకు తాను నిర్ణయించుకున్నానని ఆమిర్ తెలిపారు.

పీకేలో ఆ సీన్ షూటింగ్ సందర్భంగా జరిగిన విషయాలను ఆమిర్ వివరించారు. “షూటింగ్ రోజు నేను ఆ షార్ట్స్ వేసుకున్నా. రేడియోతో బయటికి వచ్చా. ఆ రోజు సెట్స్‌లో ఎవరి ఫోన్‍ను రాజు (దర్శకుడు రాజ్‍కుమార్ హిరానీ) అనుమతించలేదు. అందరి ఫోన్లను ఆయన దాచేసారు. ఆ సీన్‍లో నేను పరుగెత్తాల్సి వచ్చింది. అయితే, నడుస్తున్నప్పుడు నాకు ఓకే అనిపించింది. అయితే, పరుగెత్తాల్సి వచ్చింది. నేను పరుగెత్తుతున్నప్పుడు ఆ షార్ట్స్ ఊడిపోతున్నాయి. ఎందుకంటే వాటికి టేప్ ఉంది. ఆ షాట్‍లో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఎందుకంటే వేగంగా పరుగెత్తాలి. ఇక రెండు ప్రయత్నాల తర్వాత రాజుతో మాట్లాడా. ఆ షార్ట్ కూడా తీసేస్తానని చెప్పా. ఎందుకంటే నాకు పర్‌ఫెక్ట్ షాట్ రావాలి. అందుకే వాటిని తొలగించా. అందరినీ కెమెరాకు దూరంగా పంపించేయాలని చెప్పా. ఆ తర్వాత నేను పరుగెత్తా” అని ఆమిర్ ఖాన్ చెప్పారు.

ముందు కంగారు పడినా..

పూర్తి నగ్నంగా ఆ షాట్ చేయాలనుకున్నప్పుడు తాను ముందు కాస్త కంగారు పడ్డానని, అయితే అది ఏం పెద్ద సమస్య కాదని ఆ తర్వాత అనిపించిందని ఆమిర్ చెప్పారు. “సెట్‍లో నగ్నంగా నడవడం కాస్త తేడాగా అనిపిస్తుందేమోనని ముందు అనిపించింది. ఎలా చేయాలా అని ముందుగా కంగారు అనిపించింది. అయితే సెట్‍లోకి వచ్చాక నేను పని చేయాల్సిందేనని అనుకున్నా. అయితే షాట్ సరిగా రావట్లేదని అనిపించింది. దీంతో ఇవన్నీ (షార్ట్స్) అనవసరం అని రాజుకు చెప్పా. ఒకవేళ నన్ను నగ్నంగా చూస్తే సమస్య ఏంటి? అని చెప్పా. షాట్ బాగా రావాలని అన్నా. ఆ సమయంలో నాకు పెద్దగా సిగ్గు అనిపించలేదు. నేనే అలా చేశానా అని ఆ తర్వాత షాకయ్యా” అని ఆమిర్ తెలిపారు.

రాజ్‍కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన పీకే చిత్రం 2014లో వచ్చి బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రం సుమారు రూ.770కోట్ల కలెక్షన్లు సాధించింది.

ఆమిర్ ఖాన్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ మూవీలో నటిస్తున్నారు. జెనీలియా, దర్షిల్ సఫారీ కూడా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Whats_app_banner