కండరాల పెరుగుదలకు సహకరించే 6 రకాల పండ్లు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Dec 20, 2024

Hindustan Times
Telugu

శరీరంలో కండరాలు పెరిగేందుకు వర్కౌట్లు చేయడంతో పాటు అందుకు తగ్గట్టుగా పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. కండరాలు పెరిగేందుకు కొన్ని రకాల పండ్లు కూడా సహకరిస్తాయి. అలాంటి ఆరు పండ్లు ఏవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

అవకాడోలు కండరాల పెరుగుదలకు సహకరిస్తాయి. ఇందులోని ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పోటాషియం ఇందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

నారింజ పండ్లలో విటమిన్ సీ, నేచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి తినడం వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటు కండరాలకు మేలు జరుగుతుంది.

Photo: Pexels

కివీ పండ్లలో విటమిన్ సీ, ఈ, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని ఈ పండు పెంచగలదు. దీంతో కండరాల పెరుదలకు సహకరిస్తుంది. 

Photo: Pexels

అరటి పండ్లలో పొటాషియం, కార్బొహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. కండరాలు పట్టేయకుండా ఈ పండు చేయగలదు. మంచి శక్తి అందిస్తుంది. 

Photo: Pexels

బ్లూబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. మజిల్ లాస్ కాకుండా ఈ పండ్లు తోడ్పడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్‍ను కూడా ఈ పండు తగ్గిస్తుంది. 

Photo: Pexels

యాపిల్ పండ్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మజిల్ రికవరీకి ఈ పండు సహకరిస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.

Photo: Pexels

చలికాలంలో చుండ్రు సమస్యలా...! ఇలా వదిలించుకోండి

image credit to unsplash