Keerthy Suresh remuneration: బేబీ జాన్ కోసం భారీగా పారితోషికం తీసుకున్న కీర్తి సురేశ్.. పాటల్లో అందాలు ఆరబోత
Keerthy Suresh remuneration: కీర్తి సురేశ్‌కి ఈ ఏడాది అన్నీ బాగా కలిసొచ్చాయి. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన ప్రియుడిని పెళ్లి కూడా చేసుకుంది.
సౌత్ ఇండియన్ సినిమాల్లో అగ్ర కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. బాలీవుడ్‌లో ఆమె నటించిన తొలి సినిమా బేబీ జాన్ రిలీజ్‌కి సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. చాలా రోజుల నుంచి సౌత్‌లో నటిస్తున్న కీర్తి సురేశ్.. బేబీ నాన్ మూవీలో అందాల్ని ఆరబోసింది. ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం కీర్తి సురేశ్ తీసుకుందట.
కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ మూవీ.. తమిళ సూపర్ హిట్ మూవీ తేరికి రీమేక్. ఈ చిత్రాన్ని దర్శకుడు అట్లీ తెరకెక్కించగా.. అతను కీర్తి సురేష్‌కి క్లోజ్ ఫ్రెండ్. దాంతో బాలీవుడ్‌లో ఈ భామకి తొలి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కీర్తి రెమ్యూనరేన్ డబుల్
బాలీవుడ్‌లో తొలి సినిమా కావడంతో.. గత చిత్రాల కంటే ఎక్కువ గ్లామర్‌గా కనిపించిన కీర్తి.. రెమ్యూనరేషన్‌ని కూడా భారీగా డిమాండ్ చేసి మరీ తీసుకుందట. ఇప్పటి వరకూ తమిళ్, తెలుగు సినిమాల్లో నటించేందుకు కీర్తి సురేశ్ రూ.2-3 కోట్లు వరకూ తీసుకోగా.. బేబీ జాన్ కోసం రూ.4 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు సమాచారం.
తేరి సినిమాలో విజయ్ పాత్రలో వరుణ్ ధావన్, సమంత పాత్రలో కీర్తి సురేష్, అమీ జాక్సన్ పాత్రలో వామికా గబ్బి నటిస్తున్నారు. వాస్తవానికి తేరిలో సమంత పాత్ర చాలా హోమ్లీగా ఉంటుంది. రొమాంటిక్ సాంగ్ కూడా ఒకటి ఉంది. బేబీ జాన్ నుంచి రిలీజైన ఒక సాంగ్ వైరల్ అవగా.. అందులో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్‌తో పోటీపడి డ్యాన్స్ చేశారు. మరీ ముఖ్యంగా కీర్తి సురేశ్ డాన్స్ మూవ్స్‌పై వేలాది రీల్స్ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి.
కీర్తికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే
డిసెంబర్ 12న కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తాటిల్‌ను వివాహం చేసుకుంది. గోవాలో తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతి ప్రకారం కూడా వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తంతు ముగిసిన రోజుల వ్యవధిలోనే ముంబైలో జరిగిన బేబీ జాన్ ప్రమోషన్ కార్యక్రమానికి కీర్తి హాజరైంది.
కీర్తి సురేష్ నటించిన రఘు తాతకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా తర్వాత రివాల్వర్ రీటా, కన్నివేది తదితర చిత్రాల్లో కీర్తి సురేశ్ నటిస్తోంది. అలానే బాలీవుడ్ అరంగేట్రం, తన బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లితో ఈ ఏడాది కీర్తి సురేశ్ ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.