తెలుగు న్యూస్ / ఫోటో /
Samantha: వరుణ్ ధావన్‌తో సమంత హాట్ ఫొటో షూట్.. సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ రిలీజ్ ముంగిట ఫొటోలు వైరల్
సమంత, వరుణ్ ధావన్ నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ యాక్షన్ ప్యాక్‌డ్ వెబ్ సిరీస్ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ మ్యాడెన్, గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన వెబ్ సిరీస్‌కు ఈ ‘సిటాడెల్: హనీ బన్ని’ ఇండియన్ వెర్షన్.
(1 / 6)
సిటాడెల్: హనీ బన్ని వెబ్ సిరీస్ ముంగిట సమంత, వరుణ్ ధావన్ హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య రొమాన్స్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది(primevideoin/instagram)
(2 / 6)
అమెజాన్ ప్రైమ్ వేదికగా గురువారం (నవంబర్ 7) నుంచి సిటాడెల్: హనీ బన్ని వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ముంబయిలో ఇప్పటికే ప్రీమియర్‌ను నిర్వహించగా బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరై పాజిటివ్‌గా సోషల్ మీడియాలో స్పందించారు. (primevideoin/instagram)
(3 / 6)
సిటాడెల్‌లో తన పాత్రని ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించినట్లు ఇప్పటికే చెప్పుకొచ్చిన సమంత.. కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడినట్లు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.(primevideoin/instagram)
(4 / 6)
సిటాడెల్: హనీ బన్ని వెబ్ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌లను డైరెక్ట్ చేసి మెప్పించిన రాజ్ అండ్ డీకే .. ఈ సిరీస్‌లో ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. (primevideoin/instagram)
(5 / 6)
ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్- 2 వెబ్ సిరీస్‌లో నటించిన సమంత.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సిటాడెల్: హనీ బన్నిలో తన రోల్ క్లిష్టమైనది అయినప్పటికీ.. ఇలాంటి క్యారెక్టర్స్ తనకి ఇష్టమని సమంత ఇటీవల చెప్పుకొచ్చింది. (primevideoin/instagram)
ఇతర గ్యాలరీలు