Dinga Dinga: ఆ దేశంలో మహిళల చేత డాన్స్ వేయిస్తున్న డింగా డింగా వైరస్ ఏంటి? ఈ ఈ వైరస్ ఎందుకు వస్తుంది?
కొత్త కొత్త వ్యాధులు అనేక దేశాల్లో పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ఏకంగా డ్యాన్స్ చేయించే వ్యాధి పుట్టుకొచ్చింది. దాని పేరు డింగా డింగా.
అంతు పట్టని రోగాలు పుడుతున్న కాలం ఇది. ఇప్పుడు మరొక వింత వ్యాధి ఆఫ్రికాలోని ఉగాండాలో కనిపిస్తోంది. దీని పేరు డింగా డింగా. ఇది సోకితే ఆ మనుషులు డాన్స్ చేస్తున్నట్టు కదులుతూనే ఉంటారు. ముఖ్యంగా ఇది మహిళలకు, బాలికలకు మాత్రమే సోకుతుంది. తీవ్రమైన శరీర వణుకు వల్ల డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందో? దీని చికిత్స ఏంటో తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.
డింగా డింగా వ్యాధి లక్షణాలు
డింగా డింగా వ్యాధి సోకితే దాని ముఖ్యమైన లక్షణం శరీరం తీవ్రంగా వణికిపోతుంది. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. అలా శరీరం వణుకుతున్నప్పుడు డాన్స్ చేస్తున్నట్టు బయట వారికి కనిపిస్తుంది. అందుకే డింగా డింగా అని దీనికి పేరు పెట్టారు. దీని బారిన పడిన రోగులు తీవ్ర జ్వరంతో, విపరీతమైన అలసటతో బాధపడుతూ ఉంటారు. కొందరికి పక్షవాతం వచ్చినట్టు అనిపిస్తుంది. మరికొందరు నడవలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు.
ఉగాండాలోని బుండిబుగ్యా నగరంలో సుమారు 300 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అయితే ఈ వ్యాధి వల్ల మరణించిన సంఘటనలు మాత్రం ఎక్కడా ఎదురుకాలేదు. చాలామంది రోగులు చిన్నపాటి చికిత్సతోనే వారంలోపు కోలుకొని సాధారణ మనుషులు అయ్యారు.haritha
అసలు ఈ కొత్త వైరస్ ఏంటో తెలుసుకునేందుకు వైద్య నిపుణులు ఆ వ్యాధిని పరిశీలిస్తున్నారు. బాధిత వ్యక్తుల నుండి నమూనాలను సేకరించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు. ఈ రోగుల చికిత్సకు యాంటీబయోటిక్స్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది మంచి ఫలితాలను అందించడంతో ఊపిరి పీల్చుకున్నారు వైద్యాధికారులు.
డింగా డింగా వైరస్ ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో మాత్రం ఇప్పటివరకు కారణం తెలియదు. ఈ వ్యాధి చుట్టూ ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కొన్ని పర్యావరణ అంశాల వరకు కారణాలుగా భావిస్తున్నారు. కానీ ఖచ్చితంగా కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.
1518లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ అని పిలిచే ప్రాంతంలో డాన్సింగ్ ప్లేగ్ అనే వ్యాధి వచ్చిం.ది అప్పుడు కూడా ప్రజలు రోడ్లపైనే డ్యాన్సులు వేసుకుంటూ అవిశ్రాంతంగా నృత్యం చేశారు. అలా అలసి అలసి ఒకచోట పడిపోయి ఎంతో మంది మరణించారు. కూడా ఇప్పుడు దానిని పోలినట్టే ఈ డింగా డింగా వ్యాధి కూడా వచ్చింది. దీని వ్యాప్తిని అరికట్టడానికి ఆరోగ్య కార్యకర్తలతో కలిసి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. యాంటీబయోటిక్స్‌ను అందిస్తే త్వరగా కోలుకునేలా చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికీ ఒక ప్రాణం కూడా పోలేదు. కాబట్టి దీన్ని ప్రాణాంతక వ్యాధిగా పరిగణించడం లేదు.
సంబంధిత కథనం