Karam podi: పచ్చి కొబ్బరితో కారంపొడి ఇలా చేశారంటే ఇడ్లీ, దోశెల్లోకి అదిరిపోతుంది-kobbari karam podi recipe in telugu know how to make this spicy powder ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Karam Podi: పచ్చి కొబ్బరితో కారంపొడి ఇలా చేశారంటే ఇడ్లీ, దోశెల్లోకి అదిరిపోతుంది

Karam podi: పచ్చి కొబ్బరితో కారంపొడి ఇలా చేశారంటే ఇడ్లీ, దోశెల్లోకి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 20, 2024 12:08 PM IST

Karam podi: పచ్చి కొబ్బరితో చేసే కారంపొడి రుచిగా ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నా, ఇడ్లీ, దోశలతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ తెలుసుకోండి.

పచ్చికొబ్బరి కారం రెసిపీ
పచ్చికొబ్బరి కారం రెసిపీ (Youtube)

దోశ, ఇడ్లీల్లోకి చట్నీ ఉన్నా కూడా పక్కన ఏదో ఒక కారంపొడి ఉండాల్సిందే. అలాగే అన్నంలో కూడా స్పైసీ కారంపొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపితే ఆ రుచే వేరు. ఇక్కడ మేము పచ్చి కొబ్బరితో కారంపొడి ఎలా చేయాలో చెప్పాము. దీన్ని ఒకసారి చేసుకుంటే నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని చేసి చూడండి. దీని రుచి అదిరిపోవడం ఖాయం.

పచ్చికొబ్బరి కారంపొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

నూనె - మూడు స్పూన్లు

పచ్చిశనగపప్పు - రెండు స్పూన్లు

మినప్పప్పు - ఒక స్పూను

ధనియాలు - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

ఆవాలు - అర స్పూను

మెంతులు - పావు స్పూను

ఎండుమిర్చి - పది

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చి కొబ్బరి ముక్కలు - ఒక కప్పు

వెల్లుల్లి - ఐదు రెబ్బలు

ఇంగువ - చిటికెడు

పసుపు - అర స్పూను

పచ్చి కొబ్బరి కారంపొడి రెసిపీ

1. పచ్చికొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.

3. అందులో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.

4. వీటిని మిక్సీ జార్లో వేసి ఒకసారి రుబ్బుకోవాలి.

5. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసి ఈ మొత్తాన్ని మెత్తగా రుబ్బుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.

7. ఆ నూనెలో అర స్పూన్ జీలకర్ర, అర స్పూను ఆవాలు, అర స్పూను పచ్చిశనగపప్పు, అర స్పూను మినప్పప్పు, గుప్పెడు కరివేపాకులు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి.

8. అందులో పసుపు కూడా వేసి బాగా కలపాలి.

9. ఇప్పుడు ముందుగా పొడిచేసి పెట్టుకున్న కొబ్బరికాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవాలి.

11. అంతే పచ్చి కొబ్బరి కారంపొడి రెడీ అయినట్టే.

12. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చాలి. తరువాత దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి భద్రపరచుకోవాలి.

13. ఇడ్లీతో, దోశలతో తింటే రుచి అదిరిపోవడం ఖాయం.

ఇందులో మనం పచ్చి కొబ్బరిని వాడాం. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తే ఈ పచ్చి కొబ్బరికారాన్ని అన్నంలో వేసి కలుపుకొని తినండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది. ఇడ్లీలు, దోశలు చేసినప్పుడు చట్నీ చేసేందుకు మీకు సమయం లేకపోతే ఈ కారం పొడి తో తినేయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం