OTT Crime Thriller Web Series: రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండి-ott crime thriller web series swipe crime now streaming on amazon prime video mx player ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller Web Series: రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండి

OTT Crime Thriller Web Series: రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండి

Hari Prasad S HT Telugu
Dec 20, 2024 11:30 AM IST

OTT Crime Thriller Web Series: ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చేసింది ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అంతేకాదు ఈ సిరీస్ ను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే అవకాశం ఉండటం విశేషం. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటి? ఎందులో చూడాలన్న విషయాలు తెలుసుకోండి.

రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండి
రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండి

OTT Crime Thriller Web Series: ఓటీటీలో ఈ వీకెండ్ చూడటానికి ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ సిద్ధంగా ఉన్నాయి. అయితే శుక్రవారం (డిసెంబర్ 20) మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈ జాబితాలో వచ్చి చేరింది. ఒకటి కాదు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ సిరీస్ రావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లలో ఈ కొత్త సిరీస్ చూడొచ్చు. ఎంఎక్స్ ప్లేయర్ అయితే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగా చూడొచ్చు.

yearly horoscope entry point

స్వైప్ క్రైమ్ వెబ్ సిరీస్

తాజాగా ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ లలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్వైప్ క్రైమ్ (Swipe Crime). శుక్రవారం (డిసెంబర్ 20) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో అయితే సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. అదే ఎంఎక్స్ ప్లేయర్ అయితే ఫ్రీగా చూసే వీలుంది. కానీ యాడ్స్ ను భరించాల్సిందే. ఇదొక 8 ఎపిసోడ్ల హిందీ వెబ్ సిరీస్. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులోకి వచ్చింది.

ఏంటీ స్వైప్ క్రైమ్ సిరీస్ స్టోరీ?

స్వైప్ క్రైమ్ వెబ్ సిరీస్ ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సిరీస్. ఇది కొందరు కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ. సైబర్ క్రైమ్ బారిన పడి తమ సీనియర్ మృత్యువాత పడటంతో అందరికీ ఫ్రీగా, సేఫ్ గా ఉండే ఓ డేటింగ్ యాప్ క్రియేట్ చేయాలని కొందరు స్టూడెంట్స్ భావిస్తారు. అయితే అది వాళ్లను ఎలాంటి చిక్కుల్లో పడేసిందన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ.

ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, ఇద్దరు కనిపించకుండా పోవడంతో పోలీసులు ఎంట్రీ ఇస్తారు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. ఈ స్వైప్ క్రైమ్ వెబ్ సిరీస్ లో రిషబ్ చద్దా, ముగ్దా అగర్వాల్, సాన్యమ్ శర్మ,రియా దీప్సి, ఫైజల్ మాలిక్, రాజేష్ శర్మలాంటి వాళ్లు నటించారు. హర్ష్ మైన్రా ఈ సిరీస్ డైరెక్ట్ చేశాడు.

ఏంటీ ఎంఎక్స్ ప్లేయర్?

ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ చాలా రోజులుగా ఉంది. ఫ్రీగా ఒరిజినల్ కంటెంట్ అందిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇది. దీనిని ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటికే అమెజాన్ మినీ టీవీ పేరుతో ఉన్న ఓటీటీలోని కంటెంట్ కూడా ఈ ఎంఎక్స్ ప్లేయర్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఆ కంటెంట్ మొత్తాన్ని ఫ్రీగా చూసే అవకాశం ఉండటం విశేషం. ఆశ్రమ్ లాంటి హిట్ వెబ్ సిరీస్ వచ్చింది కూడా ఈ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలోనే.

Whats_app_banner