HYD NTR Statue: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి.. రేవంత్‌ తీరుపై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల అభ్యంతరం-telangana movement journalists object to ntr statue installation in hyderabad revanths behavior ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Ntr Statue: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి.. రేవంత్‌ తీరుపై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల అభ్యంతరం

HYD NTR Statue: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి.. రేవంత్‌ తీరుపై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల అభ్యంతరం

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 20, 2024 11:50 AM IST

HYD NTR Statue: హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ 100 అడుగుల విగ్రహ నిర్మాణానికి భూమి కేటాయించాలని విజ్ఞప్తి సీఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించడాన్ని ఉద్యమ జర్నలిస్టులు తప్పు పడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ విగ్రహ నిర్మాణానికి భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి.

ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి కేటాయించాలని కోరుతున్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి కేటాయించాలని కోరుతున్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ

HYD NTR Statue: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహ నిర్మాణానికి భూమి కేటాయించడానికి సీఎం రేవంత్‌ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. రెండ్రోజుల క్రితం ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ సభ్యుడు మధు సూదన రాజు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని కలిశారు.

yearly horoscope entry point

ఈ క్రమంలో గత ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి వివరించి హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పడానికి, ఎన్టీఆర్‌ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేసి దానిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకొంటున్నామని ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని కోరారు.

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, నందమూరి తారక రామారావు గారి 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు మరియు ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వ తరపున స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నట్టు టీడీపీ నేతలు వెల్లడించారు.

తెలంగాణకుఇదేమిఖర్మ!

ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు భూమి కేటాయించాలనే నిర్ణయంపై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులు అభ్యతంరం చెబుతున్నారు. తెలంగాణకు ఇదేమి ఖర్మ అంటూ నిరసన చెబుతున్నారు. డెబ్భై ఏండ్ల పైబడ్డ తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఘోరమైన సంఘటన మరొకటి లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యను"తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక" తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. భూమి కేటాయించాలనే ప్రభుత్వం పునరాలోచించకుంటే అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి "తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక" పెద్ద ఎత్తున ఉద్యమిస్తదని ప్రకటించింది.

Whats_app_banner