Viduthalai Part 2 Twitter Review: విజయ్ సేతుపతి మరో హిట్ కొట్టినట్టేనా? విడుదల 2 టాక్ ఎలా ఉందంటే..-viduthalai part 2 twitter review netizens hailing vijay sethipathi vetrimaran sequel movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Viduthalai Part 2 Twitter Review: విజయ్ సేతుపతి మరో హిట్ కొట్టినట్టేనా? విడుదల 2 టాక్ ఎలా ఉందంటే..

Viduthalai Part 2 Twitter Review: విజయ్ సేతుపతి మరో హిట్ కొట్టినట్టేనా? విడుదల 2 టాక్ ఎలా ఉందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 20, 2024 12:10 PM IST

Viduthalai Part 2 X Twitter Review: విడుదలై 2 (విడుదల 2) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా అంచనాలతో ఈ సీక్వెల్ మూవీ అడుగుపెట్టింది. ఈ సినిమా చూసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీకి టాక్ ఎలా ఉందంటే..

Viduthalai Part 2 Twitter Review: విజయ్ సేతుపతి మరో హిట్ కొట్టినట్టేనా? విడుదల 2 టాక్ ఎలా ఉందంటే..
Viduthalai Part 2 Twitter Review: విజయ్ సేతుపతి మరో హిట్ కొట్టినట్టేనా? విడుదల 2 టాక్ ఎలా ఉందంటే..

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు పోషించిన విడుదలై పార్ట్ 2 మూవీ నేడు (డిసెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో విడుదల 2 పేరుతో ఈ చిత్రం రిలీజైంది. స్టార్ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. గతేడాది వచ్చి హిట్ కొట్టిన విడుదలైకి సీక్వెల్‍గా ఈ చిత్రం వచ్చింది. విడుదలై 2 చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

yearly horoscope entry point

సేతుపతి పర్ఫార్మెన్స్ అదుర్స్

విడుదలై 2 చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ సేతుపతి మరోసారి తన నటనతో అద్భుతం చేశారని కొందరు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇంటెన్స్, సీరియస్ పాత్రలో సేతుపతి దుమ్మురేపారని అంటున్నారు.

విడుదలై మూవీలో విజయ్ సేతుపతి యాక్టింగ్‍కు నేషనల్ అవార్డు ఇవ్వొచ్చని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయనలోనే మరో షేడ్ ఈ మూవీలో బయటికి వచ్చిందని, అద్భుతమంటూ రాసుకొస్తున్నారు. సేతుపతి మరో హిట్ కొట్టారని అంటున్నారు.

ఇవే హైలెట్స్ అంటూ..

విడుదలై పార్ట్ 2తో డైరెక్టర్ వెట్రిమారన్ మరోసారి తన మార్క్ చూపించారని నెటిజన్లు అంటున్నారు. ఈ చిత్రంలో ఓపెనింగ్ సీన్, ఇంటర్వెల్, ప్రీ క్రైమాక్స్, క్రైమాక్స్ హైలెైట్ అంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో సెకండాఫ్ సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇళయరాజా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని అంటున్నారు.

మాస్టర్‌పీస్

ఇంటెన్స్ డ్రామాతో, ఎగేజింగ్‍గా విడుదలై 2ను వెట్రిమారన్ తెరకెక్కించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కల్ట్ క్లాసిక్‍గా నిలుస్తుందని, మాస్టర్‌పీస్ అంటున్నారు. మంజు వారియర్, సూరి పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో విడుదలై 2 మూవీకి పాజిటివ్ బజ్ వస్తోంది.

విడుదలై పార్ట్ 2 మూవీ తొలి భాగం ఇంటెన్సిటిని కొనసాగించిందని, విప్లవాత్మకంగా ఉందని కొందరు అంటున్నారు. అణచివేత, స్వేచ్ఛ కోసం పోరాటం చుట్టూ గ్రిప్పింగ్‍గా సాగుతుందని చెబుతున్నారు.

కొందరి అసంతృప్తి

విడుదలై 2 మూవీపై ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. కొందరు మాత్రం కొన్ని విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సీన్లు చాలా లాంగ్‍గా అనిపించాయని అంటున్నారు. కొన్ని చోట్ల ఇది పొలిటికల్ క్లాస్ అన్నట్టుగా అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ మూవీకి ఎక్కువగా సానుకూల స్పందనే వస్తోంది.

విడుదలై 2 మూవీలో విజయ్ సేతుపతి, సూరితో పాటు మంజూ వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్, కిశోర్, రాజీవ్ మీనన్, భవానీ శ్రీ కీలకపాత్రలు పోషించారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‍మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ మూవీకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

విడుదలై 2 మూవీకి అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ భారీగా జరిగాయి. తమిళంతో పాటు తెలుగులోనూ టికెట్లు బాగానే అమ్ముడయ్యాయి. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. టాక్ ఇలాగే పాజిటివ్‍గా కొనసాగితే మంచి కలెక్షన్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Whats_app_banner