Besan Milk: చలికాలంలో పాలలో ఈ పిండిని కలిపి పిల్లలకు ఇచ్చారంటే జలుబు, దగ్గు దరిదాపుల్లోకి కూడా రావు-winter special besan milk remedy for cold and cough for your kids and toddlers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Besan Milk: చలికాలంలో పాలలో ఈ పిండిని కలిపి పిల్లలకు ఇచ్చారంటే జలుబు, దగ్గు దరిదాపుల్లోకి కూడా రావు

Besan Milk: చలికాలంలో పాలలో ఈ పిండిని కలిపి పిల్లలకు ఇచ్చారంటే జలుబు, దగ్గు దరిదాపుల్లోకి కూడా రావు

Ramya Sri Marka HT Telugu
Dec 20, 2024 12:30 PM IST

Besan Milk: శీతాకాలంలో పిల్లలకు జలుబు, దగ్గు సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటేవే. అయితే చలికాలం అంతా ఉదయాన్నే మీ పిల్లల చేత తాగించే పాలలో ఈ పిండిని కాస్త కలిపారంటే జలుబు, దగ్గు సమస్యలు వారి దరిదాపుల్లోకి కూడా రావు. ఆ సీక్రెట్ రెసిపీ ఏంటో దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

చలికాలంలో పాలలో ఈ పిండిని కలిపి పిల్లలకు ఇచ్చారంటే జలుబు, దగ్గు దరిదాపుల్లోకి కూడా రావు
చలికాలంలో పాలలో ఈ పిండిని కలిపి పిల్లలకు ఇచ్చారంటే జలుబు, దగ్గు దరిదాపుల్లోకి కూడా రావు (shutterstock)

శీతాకాలంలో పిల్లలకు జలుబు, దగ్గు సమస్యలు సర్వసాధారణం. చలి బారి నుండి పిల్లలను రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం తరచూ పిల్లలకు శరీరం కనపడకుండా ఉండేందుకు ఒంటి నిండా వెచ్చటి దుస్తులు, తలకు రుమాలు వంటి వాటిని ఉపయోగిస్తుంటాం. అయితే ఇక్కడ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే.. చలి నుంచి కాపాడుకోవడానికి కేవలం బయటి నుంచి రక్షణ కల్పించుకుంటే మాత్రమే సరిపోదు. లోపలి నుంచి కూడా వెచ్చటి ఆహార పదార్థాలను ఇవ్వాల్సి ఉంటుంది. అలా పిల్లలను చలి నుంచి కాపాడే వెచ్చటి ఆహరాల్లో బేసన్ షీరా ఒకటి. ప్రతి రోజూ ఉదయాన్నే పిల్లల చేత పాలు తాగిస్తుంటాం కదా. వాటిలో కొద్దిగా బేసన్ అంటే శనగపిండి కలిపి పట్టించారంటే జలుబు, దగ్గు వంటివి వారి దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. బేసన్ మిల్క్ లేదా బేసన్ షీర్ ఎలా తయారు చేయాలి. దాని వల్ల కలిగే లాభాలేంటి తెలుసుకుందాం.

yearly horoscope entry point

బేసన్ షీరా కోసం కావలసిన పదార్థాలు:

1 టీస్పూన్ దేశీ నెయ్యి

1/2 టీస్పూన్ శెనగపిండి

2 టీస్పూన్లు నూరిన బాదం

2 కప్పుల పాలు

2 యాలకులు

2 టీస్పూన్ల చక్కెర లేదా బెల్లం

బేసన్ షీరా తయారుచేసే విధానం..

బేసన్ షీరా( శెనగపిండి పాలు) తయారు చేయడం చాలా సులభం, ఉదయాన్నే పిల్లల కోసం త్వరగా తయారు చేయవచ్చు.

- ఇందుకోసం ముందుగా కడాయిలో రెండు టీస్పూన్ల నెయ్యి వేయాలి.

- 1/2 టీస్పూన్ శెనగపిండి వేసి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు వేయించాలి. శనగపిండి చక్కగా వేగి బంగారు రంగులోకి మారాలి.

- ఇప్పుడు అందే కడాయిలో మెత్తగా నూరిన బాదం పప్పులను దోరగా వేయించాలి.

- ఈ రెండూ బాగా వేగిన తర్వాత అదే గిన్నెలో రెండు కప్పుల పాలు పోసి బాగా కలపాలి.

- ఈ పాలు చక్కగా మరిగే వరకూ ఉంచాలి.

-శనగపిండి, పాలు రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో చిటికెడు తురిమిన యాలకులు, మెత్తగా నూరిన నల్ల మిరియాల పొడి వేయాలి.

- మంటను ఆపివేసిన తర్వాత రెండు టీస్పూన్ల చక్కెర లేదా బెల్లం వేసి కలపాలి. అంతే బేసన్ షీర్ రెడీ అయినట్లే.

ప్రతి రోజూ ఉదయాన్నే ఈ పాలను ఒక కప్పులో పిల్లలకు ఇవ్వండి. ఇది మంచి రుచికరమైన పానీయంగా మాత్రమే కాకుండా చలికాలంలో వచ్చే ముక్కు కారడం, గొంతు, నొప్పి, తీవ్రమైన దగ్గుకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

రాత్రి పడుకునే ముందు కూడా ఈ బేసన్ షీరాను మీ పిల్లల చేత తాగించవచ్చు. నిద్రపోయే ముందు వీటిని ఇవ్వడం వల్ల మీ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. వేరు వేరు వెబ్‌సైట్లు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇది కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Whats_app_banner