Onion For Hairs : జుట్టు అందంగా ఉండాలంటే ఉల్లిపాయ, జీలకర్ర ఇలా వాడాలి-how to get rid of dandruff and white hairs with onion and black cumin home remedy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Onion For Hairs : జుట్టు అందంగా ఉండాలంటే ఉల్లిపాయ, జీలకర్ర ఇలా వాడాలి

Onion For Hairs : జుట్టు అందంగా ఉండాలంటే ఉల్లిపాయ, జీలకర్ర ఇలా వాడాలి

Anand Sai HT Telugu
Jan 18, 2024 01:30 PM IST

Onion and Black Cumin Benefits : ఉల్లిపాయ జుట్టుకు ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. జీలకర్ర కూడా జుట్టుకు మంచి చేస్తుంది. ఈ రెండు కలిపి వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం..

జుట్టుకు ఉల్లిపాయ, జీలకర్ర
జుట్టుకు ఉల్లిపాయ, జీలకర్ర (unsplash)

జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే మన జీవనశైలి, మనం తినే ఆహారమే దీని మీద ప్రభావం చూపిస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు, సరైన ఉత్పత్తులను వాడితే జుట్టు అందంగా పెరుగుతుంది. అంతేకాదు మార్కెట్లో దొరికే రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇంట్లో తయారు చేసే వాటిని ఉపయోగించాలి.

జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. చలికాలంలో ఈ సమస్య మరి ఎక్కువగా పెరుగుతుంది. చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు తరచుగా గరుకుగా మారుతుంది. చుండ్రు వదిలించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చాలా మంది చుండ్రును వదిలించుకోవడానికి షాంపూని ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు చాలా హానికరం. ఎందుకంటే ఇది జుట్టును గరుకుగా మారుస్తుంది. చుండ్రుకు ప్రధాన కారణం చర్మం కరుకుదనం. అయితే ఇంట్లోనే నల్ల జీలకర్ర, ఉల్లిపాయతో చుండ్రును పోగొట్టుకోవచ్చు.

ఉల్లిపాయ, నల్ల జీలకర్ర రెండూ జుట్టుకు చాలా మేలు చేస్తాయి. నల్ల జీలకర్ర వాడటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు పోషణను పెంచుతుంది. ఉల్లిపాయ జుట్టుకు కూడా మేలు చేస్తుంది. రెండింటినీ కలిపి కలపాలి. అయితే ఈ మిశ్రమాన్ని తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.

ఒక గిన్నెలో కొన్ని నల్ల జీలకర్ర తీసుకోండి. చిన్న సైజు ఉల్లిపాయను తీసుకోండి. ఉల్లిపాయ తొక్క తీయండి. అందులో కొన్ని గోరు వెచ్చని నీటిని పోయాలి. గాలి చొరబడని చోట పెట్టాలి. ఉల్లిపాయ తొక్కలన్నీ నీట మునిగి ఉండేలా చూసుకోండి. తర్వాత కాసేపు షేక్ చేయాలి. ఇలా 2 నుంచి రెండున్న గంటల పాటు అలాగే ఉంచాలి.

ఈ సమయం తర్వాత దానిని మిక్సీలో గ్రైండ్ చేయండి. ఆ రసాన్ని మీ తలపై అప్లై చేయండి. జుట్టు మూలాలకు కూడా రాయాలి. దీన్ని జుట్టు చివర్లకు కూడా అప్లై చేయవచ్చు. జుట్టు మొత్తానికి అప్లై చేసిన అరగంట నుంచి గంట తర్వాత జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి. అప్లై చేసిన రోజున మీ జుట్టుకు షాంపూ వేయకండి. వారానికి రెండుసార్లు ఇలా చేయెుచ్చు. కొన్నిరోజుల తర్వాత వారానికి ఒకసారి ఉపయోగించండి. తీవ్రమైన చుండ్రు ఉన్నట్లయితే అంటే శీతాకాలంలో వారానికి ఒకసారి ఉపయోగించండి. వేసవిలో 15 రోజులకు ఒకసారి ఉపయోగించవచ్చు. ఇది చుండ్రును తొలగిస్తుంది. జుట్టు అందంగా ఉంటుంది.

ఎక్కువ ఒత్తిడితో జుట్టుపై ప్రభావం పడుతుంది. నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో అనేక సమస్యలు వస్తాయి. క్రమంగా తెల్ల జుట్టు నల్లబడుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ ధ్యానం చేయాలి. సరిగా నిద్రపోవాలి.

ఇక రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా వాడొద్దు. హెయిర్ ప్రొడక్ట్స్‌ లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు ఇచ్చినా.. జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను వాడుకోవాలి.

Whats_app_banner