Hair Loss Foods : ఈ ఆహారాలతో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ జుట్టు రాలుతుంది
Hair Loss Foods In Telugu : కొన్ని ఆహారాలు జుట్టు రాలేందుకు కారణమవుతాయి. వాటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.

ఈ కాలంలో జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన, దృఢమైన, మెరిసే జుట్టును పురుషులు, మహిళలు ఇద్దరూ కోరుకుంటారు. అందమైన జుట్టు అంటే ఖరీదైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం మాత్రమే కాదు. చర్మం వలె జుట్టు కూడా బాగుండాలంటే.. మంచి ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం కూడా జుట్టు రాలిపోయేలా చేస్తుంది.
ఒత్తిడి, కాలుష్యం మన జుట్టును ప్రభావితం చేస్తాయని ఇప్పటికే తెలుసు. అయితే కొన్ని ఆహారాలు కూడా జుట్టు రాలడం సమస్యకు కారణమవుతాయి. ఒత్తిడి, జన్యుశాస్త్రం కారణంగా జుట్టు సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా సరైన ఆహారం లేకపోవడం కూడా ఇబ్బందులను కలిగిస్తుంది. వాటి గురించి చూద్దాం..
చక్కెర మీ జుట్టుకు ఎంత చెడ్డదో.. మీ మొత్తం ఆరోగ్యానికి కూడా అంతే హానికరం. మధుమేహం, స్థూలకాయానికి దారితీసే ఇన్సులిన్ నిరోధకత మీ జుట్టును కోల్పోయేలా చేస్తుంది. పురుషులు, స్త్రీలలో బట్టతలకి కూడా దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్సులిన్ నిరోధకతలో ప్రధాన కారకం చక్కెర, స్టార్చ్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం.
అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతాయి. శుద్ధి చేసిన పిండి, రొట్టె, చక్కెర వంటి ఆహారాలు అన్ని అధిక GI ఆహారాలు. ఈ ఆహారాలు హార్మోన్ల అసమతుల్యతను సృష్టిస్తాయి. ఇన్సులిన్, ఆండ్రోజెన్‌లలో స్పైక్‌ను కలిగిస్తాయి. ఇవి వెంట్రుకల కుదుళ్లకు ఇబ్బందులు కలిగించి జుట్టు రాలడానికి దారితీస్తాయి.
జుట్టు కెరాటిన్ అనే ప్రొటీన్‌తో తయారవుతుంది. కెరాటిన్ అనేది మీ జుట్టుకు నిర్మాణాన్ని అందించే ప్రోటీన్. ఆల్కహాల్ ప్రోటీన్ సంశ్లేషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు బలహీనంగా మారుతుంది. ఎటువంటి షైన్ ఉండదు. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడి జుట్టు రాలిపోతుంది.
డైట్ సోడాల్లో అస్పర్టమే అనే కృత్రిమ స్వీటెనర్ ఉంటుంది. దీనితో ఫోలికల్స్ దెబ్బతింటుందని పరిశోధకులు కనుగొన్నారు. జుట్టు రాలడాన్ని ఎదుర్కొన్నట్లయితే, డైట్ సోడాలను పూర్తిగా నివారించడం మంచిది.
జంక్ ఫుడ్స్‌లో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఊబకాయంగా చేయడమే కాకుండా.. గుండె జబ్బులను కలిగిస్తాయి. అలాగే, ఆయిల్ ఫుడ్స్ మీ స్కాల్ప్ జిడ్డుగా అయ్యేలా చేస్తుంది, రంధ్రాలు మూసుకుపోతాయి. ఫోలికల్స్ చిన్నవిగా చేస్తాయి.
గుడ్లు జుట్టుకు మంచివి. కానీ వాటిని పచ్చిగా తినకూడదు. పచ్చి గుడ్డులోని తెల్లసొనలో కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడే బయోటిన్ అనే విటమిన్ లోపం ఉంటుంది. పచ్చి గుడ్డులోని తెల్లసొన నేరుగా తీసుకుంటే జుట్టు మీద ప్రభావం పడుతుంది.