కీర దోసకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా వేసవిలో కీర దోస తింటే హైట్రేడెట్‍గా ఉండడంతో చాలా మరిన్ని లాభాలు ఉంటాయి. అయితే, చలువ చేసే వీటిని చలికాలంలో తినొచ్చా లేదా అని చాలా మందికి సందేహాలు ఉంటాయి.
Photo: Pexels
చలికాలంలో దోసకాయను తినొచ్చు. అయితే, మరీ ఎక్కువగా కాకుండా పరిమిత సంఖ్యలో తీసుకుంటే మేలు. సలాడ్లలో యాడ్ చేసుకుంటే మంచిది.
Photo: Pexels
అయితే, చలికాలంలో కీర దోసకాయలను పగటి పూట తినాలి. వాతావరణం చల్లగా ఉండే సాయంత్రం, రాత్రి వేళల్లో తినకపోవడమే మంచిది.
Photo: Pexels
జలుబు, దగ్గుతో బాధపడే వారు చలికాలంలో కీర దోసకాయలను తినకపోవడమే మంచిది. అవి తగ్గిన తర్వాత తినొచ్చు.
Photo: Pexels
చలికాలంలో కీర దోసకాయలను తిన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవడం సహా మరిన్ని లాభాలు ఉంటాయి.
Photo: Pexels
దోసకాయ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. అయితే, చలికాలంలో కీరదోసను పరిమితంగానే తింటే మంచిది. అతిగా తినకపోవడమే మేలు.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి